– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
నేషనల్ క్రైమ రికార్డ్స్ బ్యూరో రిపోర్టు ప్రకారం జగన్ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని నేనంటున్నా.. ఓపెన్ డిబేట్ కు వస్తారా? అని వైసీపీ నాయకులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సవాల్ విసిరారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం…
-జగన్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని నేషనల్ క్రైమ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధికారిక సంస్థ రిపోర్టే చెబుతోంది
దళిత వ్యతిరేక ప్రభుత్వమని నేషనల్ క్రైమ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధికారిక సంస్థ చెప్పిన సాక్ష్యాలతో నేను డిబేట్ కు వస్తా, మీరు రావడానికి సిద్దమా? ఓపెన్ డిబేట్ కు నేను వైసీపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. సోషల్ వెల్ఫేర్ ప్రిన్స్ పల్ సెక్రటరితోగాని, కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ తో గాని సాక్షి ఛానల్ లో డిబేట్ కు నేను రెడీ, మీరు సిద్ధమా? నా ఛాలెంజ్ ని స్వీకరిస్తారా? చర్చకు మీరు మీ రికార్డులతో రండి, నేను NCRB సాక్ష్యాలను తెస్తాను. నా సాక్ష్యాలను ఎవరూ కాదనలేరు, ఎన్ సీఆర్ బీ ఓపెన్ ఛాలెంజ్ కు రావాలని పిలుపునిస్తున్నాను. మీది దళిత వ్యతిరేక ప్రభుత్వమని రుజువు చేస్తాను.
జగన్ పాలనలో దళితులపై దాడుల కేసులో ఒక్క దానిపైనైనా ఇంతవరకు ఛార్జిషీటు వేశారా?
జగన్ పాలనలో దళితులపై దాడుల కేసులో ఒక్క దానిపై నైనా ఇంతవరకు ఛార్జిషీటు వేశారా? NCRB రిపోర్టు ప్రకారం జగన్ పాలనలో దళితులపై దాడులు గతంలో చంద్రబాబు పాలన కంటే పెరిగిన విషయం నిజం కాదా? దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ నంబర్-1గా నిలవడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనం.
దళితులపై పనిగట్టుకొని ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని చెబుతుంటే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. నేషనల్ క్రైమ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధికారిక సంస్థ ప్రకారం.. జగన్ రెడ్డి పాలనలో వారానికి నాలుగు హత్యలు, ఆరు ఆత్మ హత్యలు, రోజుకు ఇద్దరిపై దాడులు, వారానికి ముగ్గురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏపీలో 2021లో నేరాల్లో 23.8% ఉండగా.. 2022 లో 27.4% కు పెరిగింది. అంటే దళితులపై 4 శాతం మేర నేరాలు పెరిగాయి. టీడీపీ ప్రశ్నించేవాటికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీకి లేదు.
దళితులందరికి మేనమామనని కంసమామ అయ్యాడు
దళితులందరికి నేను మేనమామనని పెద్ద అబద్ధం చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు. మేనమామ కాదు, కంసమామలా తయారయ్యాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 28 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. చంద్రబాబు దళితులకై 28 సంక్షేమ పథకాలు అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటన్నింటిని రద్దు చేసిన విషయం వాస్తవం కాదా? లక్ష ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులలో ఒకటి కూడా భర్తీ చేయలేదన్నది నిజం కాదా?
దళితులకు సంబంధించిన 14 లక్షల అసైన్డ్ భూములు వైసీపీ నాయకులు కొట్టేస్తుంటే నిస్తేజంగా చూస్తూ ఊరుకున్నది జగన్, వైసీపీ ప్రభుత్వం కాదా? వైద్య కళాశాలల్లో దళితులకు రావాల్సిన మెడికల్ సీట్లు తగ్గిస్తే నిస్తేజంగా చూస్తూ ఉన్నారు. స్టడీ సర్కిల్ ను రద్దు చేస్తే నోరు మెదపలేదు. చంద్రబాబు హయాంలోస్టడీ సర్కిల్స్ పెట్టి పేద దళితులకు మేధావులైన టీచర్లచే ట్యూషన్లు చెప్పించి వారికి ఉద్యోగ అర్హతలు కల్పించారు. చంద్రబాబు పరిపాలనలో దళితులందరూ సంతోషంగా ఉంటే జగన్ పరిపాలనలో అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. చంద్రబాబు పెట్టిన పథకాలను రద్దు చేసి జగన్ ఏం సాధించారు. పారిశ్రామికంగా రావాల్సినవాటిని కూడా రద్దు చేశారు.
*మాల, మాదిగ, రెల్లి లాంటి కుల కార్పొరేషన్ల ద్వారా ఒక్క రుణమైనా ఇచ్చారా?
మాల, మాదిగ, రెల్లి లాంటి కుల కార్పొరేషన్ల ద్వారా ఒక్క రుణమైనా ఇచ్చారా? దళితులకు ఉన్న కాలును విరగ్గొట్టి, కృతిమ కాలు పెట్టే విధంగా జగన్ పాలన ఉంది. చంద్రబాబు హయాంలో వేలాది ఎకరాల భూమి కొనుగోలు పథకం కింద దళితులకిస్తే, జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టి వేలాది మందిని విదేశాలకు పంపే అవకాశాన్ని చంద్రబాబు కల్పిస్తే, మీరు దానికి అంబేద్కర్ పేరు తొలగించి మీ పెరు పెట్టుకున్నారు, మీరు అంబేద్కర్ కంటే గొప్పవారా? డాక్టర్ సుధాకర్ చనిపోతే ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తెలియదు. దళిత పక్షపాతిగా నేను చెప్పడంలేదు, NCRB రిపోర్టే చెబుతోంది.
రాష్ట్రంలో దాడులు పెరిగాయని. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు 75 శాతం మేం వాటా ఇస్తాం, 25 శాతం మీరు పెట్టుకొండి దళిత సంక్షేమానికి వాడుదామని చెబితే ఆ 75 శాతం కూడా తీసుకోకుండా తిరస్కరించడంతో ప్రభుత్వ తీరు తేటతెల్లమౌతోంది. రాష్ట్రంలో నేరాలు జరగడానికి జగన్ ప్రభుత్వ ఉదాసీనత కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏదేమైనా తాను విసిరిన సవాల్ ను స్వీకరించాలని పునరుద్ఘాటించారు.