యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెట్టడం చంద్రబాబు చేసిన తప్పా?
మానవ వనరుల అభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనుకోవడం నేరమా?
-దూళిపాళ్ల నరేంద్ర
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రంలో విషసంస్కృతికి తెరలేపారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై పోరాడే నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా పాటుపడిన చంద్రబాబునాయుడిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డే చంద్రబాబు నాయుడిపై కేసులు పెట్టి ఉపసంహరించుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం చంద్రబాబు చేసిన తప్పా?
మానవ వనరుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలబెట్టాలనుకోవడం నేరమా?. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీమెన్స్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. తెదేపా ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య 2.13 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే..జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇదే ప్రాజెక్టును ఉపయోగించుకుని 21 వేల మందికి శిక్షణ ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో స్కాం జరిగితే వైకాపా ప్రభుత్వం 21 వేల మంది విద్యార్ధులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వగలిగింది? నేడు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు నాడు గుజరాత్‌లో 2013 లోనే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు.
సీమెన్స్ భాగస్వామ్యంతో గుజరాత్‌లో విజయవంతంగా నడుస్తున్న సెంటర్లను సందర్శించడానికి రాష్ట్రం నుంచి అధికారుల బృంధం పర్యటించిన మాట వాస్తవం కాదా? 2015 నవంబర్ 5,6 తేదీలలో శ్రీమతి సునీత గారు, లక్ష్మీనారాయణ ఐఏఎస్ గారు, గంటా సుబ్బారావు ఐఏఎస్ గారు గుజరాత్ పర్యటించిన బృంధంలో ఉన్నారు. వీరు సీమెన్స్, డిజైన్‌టెక్ బృందాన్ని కలిశారు. గుజరాత్‌కు చెందిన ఇండస్ట్రీస్ అడిషనల్ సెక్రటరీ అరవింద్ అగర్వాల్‌ను, కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మమతా వర్మను, ఇండస్ట్రీస్ జాయింట్ కమీషనర్ అయిన త్రివేదినీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెక్రటరీలను కలిశారు.
గుజరాత్‌లో ప్రాజెక్టుకు నిధులు ఏ విధంగా చెల్లిస్తున్నారు అన్న విషయానికి సంబంధించి… The Funds of Government meant for implementation of phase-1, Phase -2 were transferred institution wise to designed Tech in one go advance…అని గుజరాత్ ఇండస్ట్రీస్ జాయింట్ కమీషనర్ అయిన త్రివేది గారు చెప్పారు. స్కిల్ డెవెలప్‌మెంట్ ప్రాజెక్టుకు ముందుగానే డబ్బులు చెల్లించి అవినీతికి పాల్పడ్డారని గావుకేకలు పెడుతున్న వైకాపా నాయకులు ఇది తెలుసుకోవాలి. Siemens is a reputed company working with design tech implementation of project is satisfactory అని మన అధికారుల బృందం నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా?
గుజరాత్ సందర్శించిన సంయుక్త అధికారుల బృంధం ఇచ్చిన నివేదిక ప్రకారమే సీమెన్స్‌కు నిధులు విడుదల చేసిన సంగతి సిఐడీ అధికారులకు తెలియదా? అంచనాలు పెంచి డబ్బులు దోచుకున్నారని మాట్లాడుతున్న వైకాపా నాయకులు ప్రేమచంద్రారెడ్డి సెంట్రల్ టూల్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌కు స్కిల్ ప్రాజెక్టు కాస్ట్‌ను మదించాలని రాసిన లేఖపై ఎందుకు మాట్లాడటం లేదు? ప్రాజెక్టు విలువపై లేఖ రాసింది ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేమచంద్రారెడ్డి, నివేదిక ఇచ్చింది సెంట్రల్ టూల్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ …మధ్యలో చంద్రబాబు నాయుడి గారికి ఏం సంబంధం?
నిజంగా ప్రాజెక్టు విలువ పెంచితే ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు బాధ్యుడిగా చేర్చలేదు? కేవలం రాజకీయ కుట్రతోనే చంద్రబాబుపై కేసుపెట్టారు. గంటా సుబ్బారావు చంద్రబాబు నాయుడి బంధువని పేర్ని నాని మాట్లాడుతున్నాడు. పేర్ని నాని వ్యాఖ్యలు వింటుంటే ఆయన తన తండ్రి కృష్ణమూర్తిగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారా? అనే సందేహం కలుగుతోంది. గంటా సుబ్బారావు నిజంగా చంద్రబాబు నాయుడి గారి బంధువైతే వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ల బాధ్యత గంటా సుబ్బారావు గారికి ఎందుకిచ్చారు?
వైకాపా నాయకులు కులాల గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు? గంటా సుబ్బారావు గారు అమెరికాలో ఉన్నత విధ్యాబ్యాసం చేసిన అనుభవం కలిగిన వ్యక్తిగా ఆయనకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అంతేకానీ, ఆయన కులాన్ని చూసి మాత్రం కాదు. స్కిల్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా పనిచేసిన ప్రేమచంద్రారెడ్డికి, ఆయన భావమరిధి ప్రభాకర్ రెడ్డికి ఐఏఎస్‌గా ప్రమోషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదా?
రాజకీయ ప్రాపకం కోసమే పేర్ని నాని దిగజారి కులాల గురించి మాట్లాడుతున్నారు. స్కిల్ ప్రాజెక్టు ఆమోదించడంలో అజేయకల్లాం రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. స్కిల్ ప్రాజెక్టుకు సంబంధించి 1196 నంబర్ గల క్యాబినెట్ రిజల్యూష్‌ను ప్రతిపాధించిన వ్యక్తి అజేయ కల్లాం కాదా? రిజల్యూషన్ ప్రతిపాధించిన అజేయకల్లాం రెడ్డి నిజయితీపరుడు, నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఏ విధంగా దోషి అయ్యారు? జగన్‌రెడ్డికి కావాల్సిన వారిపై మాత్రంకేసులు లేకపోవడం, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం రాజకీయ కుట్ర కాదా?
స్కిల్ కార్పొరేషన్‌లో గంటా సుబ్బారావుగారు 07.10.2014 నుంచి 13.11.2015 వరకు, ప్రేమచంద్రారెడ్డి గారు 13.11.2015 నుంచి 31.03.2016 వరకు బాధ్యతలు నిర్వహించారు. సీమెన్స్ ప్రాజెక్టుకు విడుదల చేసిన నిధులు మొత్తం ప్రేమచంద్రారెడ్డి కాలంలోనే జరిగాయి. కానీ, ప్రేమచంద్రారెడ్డిని సిఐడీ ఎందుకు కేసులో ఎందుకు చేర్చలేదు? 2.13 లక్షల మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించన డేటా వెబ్‌సైట్‌లోనే ఉంది. వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?
420 బ్యాచ్‌కి సలహాలిచ్చే వ్యక్తి పొరపాటున ప్రభుత్వ సలహారుడయ్యాడు. 12 సీబీఐ , ఈడీ కేసులుండి 52 వారాలుగా కేసులు నడవకుండా తప్పించుకుని జగన్ రెడ్డి తిరుగుతున్నారు. వ్యవస్ధలను ఆయన మ్యానేజ్ చేస్తున్నారా? మేం మ్యానేజ్ చేస్తున్నామా? వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వస్తే హాస్పిటల్ చుట్టూ మనుషుల్ని పెట్టి అరెస్ట్ అడ్డుకున్న జగన్ రెడ్డి గొప్పడో కాదా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వ్యవస్ధల్ని రాజకీయ కక్ష్యసాధింపులకు పాల్పడే దుష్ట సంసృతికి జగన్ రెడ్డి తెర లేపారు.
అందులోనే ఆయన బలవుతారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లవుతుంది. వీళ్లకు ఇపుడే గుర్తొచ్చిందా? స్కీంల్లో స్కాంలు చేయటంలో పేటెంట్ జగన్ రెడ్డికే…14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిపై అనేక కేసులు వేశారు. చివరకు లక్ష్మీ పార్వతితో కూడా కేసు వేయించారు. ఇది కేవలం రాజకీయ కుట్ర, స్కాం జరగని చోట స్కాం జరిగిదందని అరెస్ట్ చేశారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు.
అధికారంలో కోల్పోతామనే భయం వారికి పట్టుకుంది. ఎక్కడ చూసినా 144 సెక్షన్ అంటూ టీడీపీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. గతంలో వైసీపీ బంద్‌లు, ధర్నాలు చేయలేదా? పోలీసులను అడ్డుకుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోంది. పోలీసులు లేకుండా ప్రజలే తన్ని తరిమి బంగాళాఖాతంలో పడేస్తారు.