Suryaa.co.in

Andhra Pradesh

మహిళల అదృశ్యంతో రాష్ట్రం పరువు పోతుంది

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

రాష్ట్రంలో మూడేళ్ళలో 29,278 మంది మహిళలు అదృశ్యమయ్యారు? దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? అని ప్రశ్నిస్తుంటే, వాలంటీర్లతో కేసులు వేయించి, వాలంటీర్ల వ్యవస్థను అడ్డంపెట్టి ప్రభుత్వం తప్పు కుంటుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.

దళిత బహుజన కులాల ఆత్మీయ సమావేశాలలో భాగంగా కర్నూల్, నంద్యాల, ఆత్మకూరు, కడప, బద్వేల్, మడకలవారి పల్లె పర్యటించి, గురువారం నెల్లూరు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా మీడియా మాట్లాడుతూ పాండవులు ఎందరు అంటే, మంచం కోళ్ళల్లా ముగ్గురు ఉంటారని రెండు వేళ్ళు చూపిన చందంగా మహిళల అదృశ్యం గురించి అడుగుతుంటే, వాలంటీర్లు దైవంశ సంభూతులు, వాలంటీర్లు లేకుంటే అభివృద్ధి లేదు.

వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలే, మహిళలు మహిళలను ఎలా ట్రాఫికింగ్ చేస్తారు? మహిళల సాధికారితకు పెద్దపేట వేశాం అంటూ మహిళా కమిషన్ తో పాటు మంత్రులు సైతం వ్యాఖ్యానాలు చేయటం దారుణం అన్నారు. ఆఖరికి ఏపీ మహిళల మిస్సింగ్ అంశం రాజ్యసభలో చర్చకు వచ్చి ఏపీలో మహిళల అదృశ్యం కేసులు పెరుగుతున్నాయని సాక్షాత్తు కేంద్ర మంత్రులు చెప్తున్నా, ప్రభుత్వానికి చలనం లేదన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసులు పెడితే, ఆయన్ను బూతులు తిడితే మిస్సింగ్ మహిళలు ఇంటికి రారు అని తెలిపారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ , మహిళా కమిషన్ లు లేవని, ఆయా కమీషన్ ఛైర్మన్ లు ప్రభుత్వ పారితోషికంతో రోజూ పండుగలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలపై ప్రమాణాలు చేసి, వాటి విలువలను దిగజార్చ వద్దని బాలకోటయ్య సూచించారు.

LEAVE A RESPONSE