– రాహుల్ గాంధీ.. అశోక్ నగర్ వచ్చే దమ్ముందా?
– తెలంగాణను దోస్తున్నారు.. ఢిల్లీకి మోస్తున్నారు.
– కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లన్ని డెత్ డిక్లరేషన్ లు అయ్యాయి
– నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ మోసం చేశాడు
– నిరుద్యోగులు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ అడగడం తప్పా?.
– బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: ఎవరి ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ICU లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చిన తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ నట్టేట ముంచాడు. ఏ మొహం పెట్టుకొని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడు?
రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడని విద్యార్థులను , నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. రాహుల్ గాంధీ మొహం చూసే కదా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మలేదు.
హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి చేవెళ్ల డిక్లరేషన్ ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండా? కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లన్ని డెత్ డిక్లరేషన్ లు అయ్యాయి. భరోసా పేరుతో తెలంగాణ ప్రజలకు భరోసా లేకుండా చేశారు. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలి. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే నిరుద్యోగుల పై లాఠీఛార్జ్ చేస్తున్నారు. చాయ్ పై చర్చ పేరుతో రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చాడు. నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ మోసం చేశాడు. నిరుద్యోగులు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ అడగడం తప్పా?.
నిరుద్యోగుల గోడు చెప్పుకునేందుకు సిద్ధమైతే ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి ఇచ్చిందో చర్చకు సిద్ధమా? రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చే దమ్ముందా? నిరుద్యోగుల నుంచి ఎటువంటి హాని రాహుల్ గాంధీకి లేకుండా చూసే బాధ్యత మాది.
అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. విద్యా భరోసా క్రింద విద్యార్థులకు 5 లక్షల ఇస్తామని చెప్పి మోసం చేశారు. 18 యేండ్లు నిండిన ప్రతి ఆడ పిల్లలకు ఇస్తామన్న స్కూటీ ఏమైందో సమాధానం చెప్పాలి. 10 వేల కోట్ల రూపాయలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండా?
అవినీతి సొమ్ముతో ఢిల్లీలో, తెలంగాణ గల్లిలో కాంగ్రెస్ పార్టీనీ నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణ మీద ప్రేమ ఉందా? అక్రమ సొమ్ము పై ప్రేమ ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో తగిన రాహుల్ గాంధీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అక్రమ కేసులు, నిర్బంధాలే కనిపిస్తున్నాయి.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి , విద్యా శాఖ మంత్రే రేవంత్ రెడ్డే. 130 మందికి పైగా గురుకుల విద్యార్థులు చనిపోతే ఒక్కరోజైనా సమీక్ష నిర్వహించారా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ తప్పింది. తెలంగాణలో ఉన్నామా, పాకిస్థాన్ లో ఉన్నామా అర్ధం కావడం లేదు. తెలంగాణను దోస్తున్నారు. ఢిల్లీకి మోస్తున్నారు. పొద్దున లేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల పై మౌనంగా ఉంటాడు.
తెలంగాణ ప్రజల తరుపున అడుగుతున్న. ప్రతి సమాధానానికి హైదరాబాద్ దాటిలోపే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. లేదంటే నిరుద్యోగులే కాలికి బలపం కట్టుకొని కాంగ్రెస్ పార్టీనీ ఓడించేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రెస్ మీట్ లో ఇంతియాజ్ అహ్మద్ ,గాంధీ నాయక్ ,బొమ్మెర రామమూర్తి ,ఫయాజ్ పాల్గొన్నారు.