– అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ రెడ్డి
– ధరలు దిగాలంటే జగన్ దిగాలి
– మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
పేదల పేరిట పట్టాలు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి 7 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. మండలంలోని తెల్లపాడు గ్రామం లో మాజీ సొసైటీ అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు, కొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాల ఆవిష్కరణకు మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్కాములు లేని స్కీములు లేవని ఎద్దేవా చేశారు. టిడిపి చంద్రబాబు పాలనలో వ్యవసాయ భూములకు ధరలు బాగా తగ్గాయని అందుకు కారణం రాష్ట్రంలో శాంతిభద్రతలు లేక ఇతర దేశాలు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగులు హైదరాబాదులో ఆస్తులు కొంటున్నారు తప్ప ఏపీలో భూములు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఉద్యోగులను, నిరుద్యోగులను, దళితులను, బీసీలను, ముస్లిం మైనార్టీలను అన్ని వర్గాలను జగన్ మోహన్ రెడ్డి మోసం చేసి వ్యాపారం చేసుకుంటూ కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు జీవించే పరిస్థితి లేదని ధరలు తగ్గాలంటే ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని తెలిపారు. టిడిపి నాయకుల పై కార్యకర్తలపై దురుసుగా వ్యవహరించిన ఏ ఒక్కరిని వదిలేది లేదని హెచ్చరించారు. పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనేక సంఘ సంస్కరణలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసిన ఏకైక మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కొనియాడారు.తలలో నాలుకలా వ్యవహరిస్తూ అనేక పదవులకు వన్నె తెచ్చి పార్టీ అభివృద్ధికి కృషిచేసిన కొమ్మ వెంకటేశ్వరరావు లాంటి పెద్దల ఆశయాలను అను కొనసాగించాలని కోరారు.
నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోందని అన్నారు. దాన్యం కొనుగోలు చేయమని రైతు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పు ఎత్తడమే కాకా హత్యాయత్నం కేసు పెట్టడాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత గౌరవం ఉందో అవగతం అవుతుందన్నారు. అభివృద్ధి కేరాఫ్ తెలుగుదేశం పార్టీ అని, ప్రతి గ్రామంలో చూస్తే రోడ్లు, పక్కా గృహాలు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు టిడిపి ప్రభుత్వం నాడు ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తే నేడు వైసిపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలకి జరిగిన అన్యాయానికి త్వరలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కొమ్ము వెంకటేశ్వర్లు అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికి పాటుపడిన మహావ్యక్తి అని, సొసైటీ అధ్యక్షులుగా కుటుంబంలో ఒకరు ఎంపీపీగా మండల ప్రజలకు అనేక సేవలందించి ప్రజా ఆదరణ పొందగోరిన వ్యక్తి అని ఆయన ఆశయాలను అందరూ కొనసాగించాలని కోరారు. పేదల రాజ్యం రావాలంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఇంచార్జ్ టిడిపి గజ్జల బ్రహ్మ రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరావు, రాష్ట్ర మాజీ బీసీ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరావు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు,రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్, డి ఎల్ డి ఎ గుంటూరు జిల్లా చైర్మన్ లగడపాటి వెంకట్రావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు విభాగం కార్యదర్శి moondru సుబ్బారావు,నూజండ్ల మండల టిడిపి అధ్యక్షుడు మురళి యాదవ్, వంకాయలపాటి పేరయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నక్క వీరారెడ్డి, గంగినేని ఆంజనేయులు, రోడ్డ వీరాంజి రెడ్డి, బచ్చు అంజి రెడ్డి ,మండలాల మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లు ,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.