తమను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలోనే కొనసాగించాలని, కొంత మంది అవగాహన లోపంతో అనాలోచితంగా చేసిన దుష్పచారం వల్ల 15000 మంది మహిళా పోలీసుల ఉద్యోగాలు ఊగిసలాడుతున్నాయి.. ఎవరో కొందరి స్వార్థపూరిత చర్యలకు అందరినీ బాధ్యులని చేయవద్దని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
డిజిపి మాట్లాడుతూ…మహిళా పోలీసులు పోలీసు శాఖలోనే కొనసాగుతారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీఓ నెంబర్ 59 ను ఉపసంహరించుకోవడం జరగలేదు, దీనిపై ప్రభుత్వం మరింత పటిష్టమైన, స్పష్టమైన, సమగ్రంవంతమైన పరిపూర్ణతతో కూడిన విషయాలతో మహిళా పోలీసు వ్యవస్థతో ముందుకు వస్తుందని, ప్రస్తుతం ప్రజలకు వారు అందింస్తున్న సేవలను మరింత అంకిత భావంతో ముందుకు వెళ్లాలని మహిళా పోలీసుల బృందం సభ్యులకు డిజిపి స్పష్టం చేయడం జరిగింది.