– టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు
తెలుగుదేశం ప్రొఫెషనల్స్ వింగ్ అద్వర్యం లో చేపట్టిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమంది రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న యువతకు పాలసీ రూపకల్పన లో మరియు రాజకీయాలలో ,ఈ ఇంటర్న్షిప్స్ ద్వారా దాదాపు వందల మంది యువతీ యువకులకుఒక మంచి వేదిక కలిపించడం జరిగింది , అందులో భాగాంగా కేవలం మహిళలకోసం జరిగిన ఇంటర్న్షిప్ గత ఆగష్టు లో ప్రారంభం అయ్యి జులై వరకు కొనసాగింది . ఈ కార్యక్రమం లో భాగంగా జరిగిన సర్టిఫికెట్ ప్రదానోత్సవం లో లోకేష్ గారు పాల్గొని యువతులు మరియు మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది.
“ఈ ట్వీట్ ను లోకేష్ గారు షేర్ చేయగా .. వైఎస్సార్ పార్టీ మరియు దాని సోషల్ మీడియా మూర్ఖులు -దేవేందర్ రెడ్డి గుర్రంపాటి (AP ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ ) వారి సోషల్ మీడియా పేజీల్లో వెళ్లగక్కుతున్న విషం మహిళా మణుల అస్తిత్వమే ప్రశ్నర్ధకం చేస్తుంది. మహిళల పై వారు చేసే అభ్యంతరకర కామెంట్లు మహిళలకు వారిచ్చే గౌరవాన్ని తెలియచేస్తుంది. తెలుగుదేశం చేపట్టిన ” విమెన్ ఇంటర్న్షిప్ ” కు హాజరైన మహిళల మనోభావాలు మరియు వారి ఆత్మగౌరవం దెబ్బ తినేలా పెచ్చరిల్లిన వారి ప్రవర్తన ఫై జాతీయ మహిళా కమిషన్ కు మరియు సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయడం జరిగింద. ఈ దారుణాలకు పాల్పడే ఏ ఒక్కరిని ఉపేక్షించే అవకాశం లేకుండా అవసరమైన న్యాయ పరమైన చర్యలు తీసుకుంటాం ” అని ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షులు తేజస్వి పొడపాటి తెలియచేసారు.