-రాష్ట్రంలో సీఎం కెసిఆర్ తర్వాత ఎక్కువ సార్లు గెలిచింది నేనే
-కెసిఆర్ దయ, మీ అండదండలతో మంత్రి నయ్యాను
-నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను
-అన్ని విధాలుగా ప్రజలకు అండగా నేనుంటాను
-ప్రజలు కెసిఆర్ కు, నాకు అండగా నిలవాలి
-కెసిఆర్ వల్ల రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది
-రాష్ట్రంలో అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గం ముందున్నది
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం బమ్మెర, పలుగు బొడు తండా, ఎర్ర కుంట తండా, దుబ్బ తండా, పెద్ద తండా, ఎన్టీఆర్ నగర్, రాఘవ పురం, గ్రామాలకు కలిపి, పాలకుర్తి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పాలకుర్తి, జూన్ 6 : నేను ఓటమి ఎరుగను. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏడుసార్లు గెలిచాను…రాష్ట్రంలో సీఎం కెసిఆర్ తర్వాత ఎక్కువ సార్లు గెలిచింది నేనే. కెసిఆర్ గారి దయ, మీ అండదండలతో మంత్రి నయ్యాను. ప్రజలకు సేవ చేసే మంచి శాఖలు నాకు ఇచ్చారు. వాటి ద్వారా ప్రజలకు చేయగలిగినంత చేస్తున్నాను. ఇంకా చేస్తాను. నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను. అన్ని విధాలుగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అండగా నేనుంటాను. ప్రజలు కెసిఆర్ కు, నాకు అండగా నిలవాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఎవరెవరో వస్తారు. ఏవేవో మాట్లాడుతారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి చేసిందేమీ లేదు. చేసేది కూడా లేదు. అలాంటి వాళ్ళను ఉరికిచ్చి కొట్టాలి. కల్లబొల్ల కబుర్లు చెప్పే కాంగ్రెస్, బోగస్ మాటలు చేప్పే బిజెపిలను నమ్మొద్దని ఆయన అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం బమ్మెర, పలుగుబోడు తండా, ఎర్ర కుంట తండా, దుబ్బ తండా, పెద్ద తండా, ఎన్టీఆర్ నగర్, రాఘవ పురం, గ్రామాలకు కలిపి, పాలకుర్తి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇవ్వాళ తెలంగాణ తెచ్చిన కెసిఆరే సీఎం కావడంతో అద్భుతంగా అభివృద్ధి జరుగుతున్నది. అన్ని రంగాల్లో ముందున్నది. మెనిఫెస్టోలో చెప్పినవి, చెప్పినవి కూడా అమలు చేశారు. దీంతో కెసిఆర్ వల్ల రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింద. రాష్ట్రంలో అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గం ముందున్నది.
నియోజకవర్గానికి నేను ఏనాడూ చెడ్డపేరు తేలేదు. అలాంటి పనులేవీ నేను చేయలేదు. మీ పేరు నిలబెట్టేలా పని చేస్తున్నాను. నన్ను. సీఎం కెసిఆర్ గారిని ఆదరించాలి. నేను మీకు అండగా ఉంటాను. మీరు మాకు అండగా నిలవాలి. మీ అభివృద్ధి బాధ్యత నాది. అని విజ్ఞప్తి చేశారు.
ఇక కొందరు ఇప్పుడిప్పుడే వలస పక్షుల్లా వాలిపోతున్నారు. ముక్కు ముఖం తెలియని వారు ఏవేవో చెబుతారు. అలాంటి వాళ్ళను నమ్మొద్దని మంత్రి తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నది. బిజెపి బోగస్ మాటలతో ముందుకు వస్తున్నది. ఈ రెండు పార్టీల వల్లే దేశం సర్వనాశనం అయింది. సీఎం కెసిఆర్ నాయకత్వం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవసరం. రాష్ట్రాన్ని ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే అద్భుతంగా తీర్చిదిద్దారు.
నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంలను చూడలేదు. అంటూ మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వివరించారు. బిజెపి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే గ్రామాల్లో ప్రజలు ఊరుకోవద్దు తరిమి తరిమి కొట్టాలి. సీఎం కెసిఆర్‌ను, నన్ను, పార్టీని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో గ్రామంలో కోట్లాది రూపాయల మేర నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతు బంధు, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర పథకాలు కొనసాగి మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి మంత్రి సహపంక్తి భోజనాలు చేయడంతో పాటు కార్యకర్తలకు దయాకర్ రావు కొసరి కొసరి వడ్డించారు. అనంతరం వారితో సరదాగా గడిపారు. అంతకుముందు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. సభలో కెసిఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ కుల సంఘాలకు చెందిన నాయకులు మంత్రిని వారి సంప్రదాయ పద్ధతుల్లో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి కృజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామాల వారీగా అభివృద్ధి నివేదికలు స్వయంగా మంత్రి చదివి వినిపించారు. ఇంకా అవసరమైన అభివృద్ధి పనులను అక్కడికక్కడే మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.