-ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతున్నాయి
-ఏసీబీ చీఫ్ సి వి ఆనంద్
-ఏసీబీ వరుస దాడుల్లో అధికారుల్లో భయం
(రమణ)
హైదరాబాద్: గత 6 నెలలుగా ఏసీబీ చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులు.. అవినీతి ఉద్యోగులందరిలో భయం పుట్టిస్తున్నాయని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అనుమానిత అధికారులు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రతి విషయాన్నీ అనుమానాస్పదంగా చూస్తున్నారని తెలిపారు.దీంతో వారిని ట్రాప్ చేసి పట్టుకునేందుకు తమ సిబ్బంది మరింత కష్టపడాల్సి వస్తుందన్నారు. అయితే ఇంత జరుగుతున్నాలంచాలకు అలవాటుపడ్డ కొందరి అత్యాశ వారిని ట్రాప్‌లో పడేలా చేస్తోందన్నారు.
ఏదేమైనా ఏసీబీ దాడుల కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో ప్రజలు లంచాలు ఇవ్వకుండా సులభంగా తమ పనులు చేయించుకోగలుగుతున్నట్లు తెలుస్తోందని సీవీ ఆనంద్ వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు తమ వంతు ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తామన్నారు. సీవీ ఆనంద్ చేసిన ఈ పోస్ట్‌తో ఏసీబీ పనితీరును నెటిజన్లు కొనియాడుతున్నారు.