– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక లో నిర్వహించిన సత్తెనపల్లి పట్టణ కమిటీ అనుబంధ కమిటీల అధ్యక్ష కార్యదర్శుల సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇంచార్జ్ లతో నిర్వహించిన సమావేశం లో శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ పదవులు ఉన్న ప్రతి ఒక్కరూ, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రానున్న సంస్థ గత ఎన్నికల్లో గెలుపునకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.