– మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నా
– నేలకొండపల్లి లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆనాడు ఇచ్చిన మాట కోసం పెద్ద పాలేరుగా పనిచేశా.ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పాలేరును తీర్చిదిద్ద. మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నా. ప్రజా ప్రతినిధిగా రెండు మూడు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశా. రామదాసు జీవిత చరిత్ర కోసం నాలుగు కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టాం. నేలకొండపల్లిలో డిగ్రీ,ఇంటర్ కళాశాల కు భవనాలు.ప్రజల కోరిక మేరకు జాతీయ రహదారి ని ఊరు బయట నుంచి రూటు మార్చా.పాత కాలువ 70 కోట్లతో పూర్తి చేశా.
ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించా.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో ఎక్కువ శాతం నీటి పారుదల సౌకర్యం కలిగిన నియోజకవర్గం పాలేరు.పేదరికాన్ని పారద్రోలడానికి నియోజకవర్గం అభివృద్ధి చేశా.ఇంకో నాలుగు సంవత్సరాలు తరువాత పాలేరు నియోజకవర్గం లాంటి నియోజకవర్గం మరొకటి ఉండదు.సీతారామా ప్రాజెక్ట్ పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరుకు తీసుకొస్తా.విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారు.