– వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల అభినందన సభలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యత్తుమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు వారి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలు అందించిన సోమిరెడ్డి
వెంకటాచలం: పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అభినందనలు.రాష్ట్రంలో గురుకుల పాఠశాలల వ్యవస్థకు శ్రీకారం చుట్టిందే మా పెద్దాయన ఎన్టీఆర్.ఇఫ్పుడు గురుకుల పాఠశాలల్లో సీట్లకు పెరిగిన డిమాండ్ చూస్తుంటే వాటికి లభిస్తున్న ఆదరణ స్పష్టమవుతోంది. వైసీపీ పాలనలో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాల్లో విలీనం చేయడం అప్పటి పాలకుల శాడిజానికి నిదర్శనం.
చంద్రబాబు నాయుడుతో చర్చించి విద్యావ్యవస్థలో మళ్లీ మార్పులు తెచ్చేందుకు నా వంతు కృషి చేస్తా.జగన్మోహన్ రెడ్డి పాలనలో అసెంబ్లీ సాక్షిగా జరిగిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారు. ఏ మంత్రి కూడా తాను ప్రాతినిధ్యం వహించే శాఖలపై సమీక్ష పెట్టిన పాపాన పోలేదు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలతో పాటు విద్యాశాఖనూ భ్రష్టుపట్టించారు.
నాడు – నేడు అంటూ ఆర్భాటం చేశారు. ఈ రోజు పొదలకూరు బాలికల హైస్కూలుకు వెళితే మూడేళ్ల నుంచి మినరల్ వాటర్ ఆర్వో ప్లాంటు మూలన పెట్టారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు.చిన్నారులకు తాగు నీరు అందించలేని వారు కూడా ఈ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ప్రతి సమస్యా పరిష్కరిస్తా.విద్యార్థుల్లో పోటీతత్వం పెరగడం శుభపరిణామం. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మార్కులు సాధిస్తున్నారు. అత్యుత్తమ ప్రతిభ చాటుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ కు అభినందనలు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యలతో పాటు సమాజంలోని ఇతర అంశాలపై పోరాటాలు చేపట్టడంలో ముందుంటుంది.