( చాకిరేవు)
కర్ణాటకలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజారెడ్డి డొనేషన్ కట్టకపోయి వుంటే?
ఎనిమిది వరకు పులివెందుల్లో వెంకటప్ప పాఠశాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చదివాడు. గురువు వెంకటప్ప జ్ఞాపకార్థం 15 ఎకరాలలో ఆయన గుర్తుగా ఇంగ్లీష్ మీడియం స్కూలు పునరుద్దరించాడు వైఎస్సార్.
బల్లారిలో సెయింట్ జాన్స్ స్కూలులో చదివాడు ఎస్ ఎస్ ఎల్సీ(11వ తరగతి) వరకు. విజయవాడ వచ్చి లయోలా కాలేజీలో పూయూసీ చదివాడు.
ఆ తరువాత బల్లారిలో వీరశైవ కాలేజీలో బిఎస్సీ చేరాడు. తండ్రి వైఎస్ రాజారెడ్డి డొనేషన్ కట్టి మదేవప్ప రాంపురి మెడికల్ కాలేజీ, గులబర్గాలో చేర్పించాడు.
అది ప్రైవేటు కాలేజీ, ప్రస్తుతం 12 లక్షలు పైగా ఏడాదికి వసూలు చేస్తారు. అప్పట్లో మాత్రం భారీగా 30 వేలు వసూలు చేసేవారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కోటికి పైగా లెక్క అన్నమాట.
70 దశకంలో కర్ణాటకలో వైద్య విద్య ప్రైవేటైజేషన్ చెయ్యకుండా వుండి వుంటే వీరశైవ కాలేజేలో బీయస్సీ చేసుకుని వచ్చి నాన్న వృత్తిలో చేరేవాడేమో.
మెడిసిన్ చదువులోనే 15 ఏళ్ల విజయలక్ష్మితో పెళ్లి, ఆమె 16వ ఏట యువ డాక్టర్‌కు జగన్ జన్మించాడు.
ప్రస్తుతం పీపీపీ అంటే తెలియనిది కాదు కొడుకుకు. తెలిసినా.. అందులో ప్రభుత్వ కోటా వుంటుంది, ప్రైవేటు కంటే ఎక్కువగా గవర్నమెంటు కోటాలో సీట్లు, దానితో పాటు బి కేటగిరీ ఫీజు తక్కువగా వుంటుంది, ఇక్కడే మన రాష్ట్రంలో వైద్య విద్య మన విద్యార్థులకు అందుబాటులోకి, అత్యుత్తమ సదుపాయాలతో.. ఫ్యాకల్టీతో లభిస్తుంది అని తెలిసినా.. ప్రైవేటేజేషన్ చేస్తున్నారు అమ్ముకొంటారు అని విమర్శలు చేస్తున్నాడు.
ఒకప్పుడు ఇదే రాష్ట్రంలో పెద్ద పెద్ద స్కాములు చేసి, ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా కాపీలకు పాల్పడి మెడికల్ సీట్లు అమ్మేసిన ఘనత ఎవరిదో ప్రజలకు ఇంకా గుర్తే. దేశ, రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కూడా మేనేజ్మెంట్ సీట్లు పెట్టి, మెరిట్ కోటాకు కోత పెట్టిన ఘనత జగనుది.
ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 15%, మిగిలిన 85% ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణలో పారదర్శకంగా కౌన్సిలింగ్ చేస్తారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే 10 మెడికల్ కాలేజీలలో ప్రభుత్వ కోటా సీట్లు, నామ మాత్రపు ఫీజులతో ప్రైవేటు కంటే తక్కువగా బి కేటగిరీ సీట్లు లభిస్తాయి అంటున్నా గగ్గోలు మొదలెట్టాడు.
అందరూ డాక్టర్లు అయిపోతే ఓర్చుకోలేని ఫ్యాక్షన్ మనస్తత్వం ఏమో!
చిత్రం : 15 ఏళ్ల విజయలక్ష్మితో ఆమెతో ఆడుకొనే పిల్లలు.