– పార్టీ కండువాలకు గుడిలో కప్పే కండువాలకు తేడా తెలియని అఙ్ఞానా ?
– ట్రంప్ విధానాలు అనుసరిస్తూ ప్రజలను భాధ పెడుతున్నది రేవంత్ రెడ్డే
– రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ
– మేము పార్టీ మారినపుడు రాజ్యాంగ బద్దంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాం
– మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
రాష్ట్రం లో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక ను అక్రమంగా తరలిస్తున్నారు. భూపాల పల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలం లో ఇసుక దోపిడీ పై మేము ధర్నా చేశాం. అయినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేదు. అసలు రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా ?
కొందరు కాంగ్రెస్ నేతలు దొంగే దొంగ అన్నట్టు ఇసుక దోపిడీ కి వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తుంటే పోటీ ధర్నాలు చేస్తున్నారు.
మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. భూపాల పల్లి నియోజకవర్గమే కాదు. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం లో కాంగ్రెస్ నేతల ప్రోద్భలం తో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే మా ప్రాంతం ఎడారిగా మారడం ఖాయం ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలి.
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించక పోవడం తో పల్లెల్లో చీకట్లు అలముకున్నాయి. ఓటమి భయం తోనే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. నిన్న ఢిల్లీ లో సీఎం స్థానిక ఎన్నికల పై చేతులెత్తేశారు. పెద్ద గ్రామపంచాయతీకి 5 లక్షలు ,చిన్న గ్రామ పంచాయతీలకు 3 లక్షలు కేటాయించాలి
సద్దుల బతుకమ్మ, దసరా పండగలకు పల్లెలకు వచ్చే జనం సౌకర్యం కోసమైనా గ్రామాల్లో సౌకర్యాలు మెరుగు పరచాలి. మంత్రి సీతక్క వెంటనే స్పందించాలి
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. పల్లెలలో వసతుల పై సీఎం కు శ్రద్ధ లేదు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా పై ప్రభుత్వం ఇంకా ఎందుకు ప్రకటన చేయడం లేదు? కేసీఆర్ సీఎం గా ఉన్నపుడు ఇలా ఎపుడైనా జరిగిందా? ఢిల్లీ కి సీఎం 55 సార్లు వెళ్లారు. సీఎం ఢిల్లీ లో చిత్ర విచిత్రంగా మాట్లాడారు. ఫిరాయింపుల పై సీఎం మాటలు హస్యాస్పదం. అందరూ నవ్వుకుంటున్నారు.
పార్టీలో చేరడానికి కండువాలు ప్రామాణికం కాక పోతే మరేవి ప్రామాణికం ? పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టికెట్ పై ఎంపీ లు గా పోటీ చేయడం, ప్రచారం చేయడం సీఎం కు కనిపించడం లేదా?
సీఎం కు ప్రజలు అమాయకులుగా కనిపిస్తున్నారా ?ఏదీ మాట్లాడినా చెల్లుతుందా ?
సీఎం ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారా ? కడియం శ్రీహరి తో పాటు సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరారని చెప్పింది నిజం కాదా ? కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు బీ ఆర్ ఎస్ ను ఎందుకు విమర్శిస్తున్నారు ?
వారు బీ ఆర్ ఎస్ లో ఉంటే బీ ఆర్ ఎస్ ను ఎందుకు విమర్శిస్తారు ?
గతంలో మేము పార్టీ మారినపుడు రాజ్యాంగ బద్దంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాం. ఇప్పటికైనా సీఎం నిబంధనలకు లోబడి నడుచుకోవాలి. స్పీకర్ దగ్గర విషయం పెండింగ్ లో ఉంది. ఆయన నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు ఓటమి తప్పదు. రేవంత్ పని అయిపోయింది.
సీఎం మాటలు రాజ్యాంగ విరుద్ధం: బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఢిల్లీ లో ఫిరాయింపు లపై సీఎం మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ ఓ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతారు .అదే రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి ఉల్లంఘిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కండువాలు కప్పడమే కాదు. కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చారు.
దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ పై ఎంపీ గా పోటీ చేయడం ఫిరాయింపు కాదా ?
పార్టీ కండువాలకు గుడిలో కప్పే కండువాలకు తేడా తెలియని అఙ్ఞానా రేవంత్ రెడ్డి ? గ్రూప్ వన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లడం దుర్మార్గం.
ట్రంప్ విధానాలు అనుసరిస్తూ ప్రజలను భాధ పెడుతున్నది రేవంత్ రెడ్డే. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ప్రెస్ మీట్ లో గోసుల శ్రీనివాస్ యాదవ్, పడాల సతీష్, నర్సింగ్ పాల్గొన్నారు.