– పార్టీని, తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తారా?
– నగల దుకాణంలో బ్లాక్ మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలు చేసి ప్రజాదారణ కోల్పోయారు
– ఎంపీగా ఓడిపోయి తల్లి దగ్గర వెళ్ళి ఏడిస్తే కెసిఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ ఆదరణ చూపించారు
– అలాంటి పార్టీ మీద మెదక్ వచ్చి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారా?
– ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ కౌన్సిలర్లు
మెదక్: కవిత తిన్నింటి వాసాలు లెక్కించే విధంగా, కన్నా తల్లి లాంటి పార్టీని, పార్టీ అధినేత కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావును విమర్శిస్తూ మాట్లాడడం సిగ్గు చేటు. మీతో ఎవరున్నారు.. ఎవరు మాట్లాడిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయమై మీరు మాట్లాడిన విధానం, మీ ట్వీట్లు అవమానకర రీతిలో ఉన్నాయనీ ఎమ్మెల్సీ కవిత పై మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు ధ్వజమెత్తారు. పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలు అయ్యారనీ, మరోసారి అవకాశం ఇస్తే మీ అవినీతి వల్ల ..నగల దుకాణంలో బ్లాక్ మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలు చేసి ప్రజాదారణ కోల్పోయారని ఆరోపించారు.
2019లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలిస్తే, మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మీరు ఎందుకు ఓడిపోయారనీ ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా ఓడిపోయి తల్లి దగ్గర వెళ్ళి ఏడిస్తే కెసిఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ ఆదరణ చూపించారు. అలాంటి పార్టీ మీద మెదక్ వచ్చి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారా? జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత రాష్ట్రంలో సంతోషంగా ఉంది ఇద్దరు మాత్రమే అన్నారు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా మరొకరు కల్వకుంట్ల కవిత అన్నారు.
నీ దుర్బుద్ధి, డబ్బు ఆశ తో అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని పార్టీని బ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కదా అని ప్రశ్నించారు. ఒకవేళ లిక్కర్ స్కాం జరగకపోయి ఉంటే, అక్రమ సంపాదన మీద ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదన్నారు. నీ అక్రమ సంపాదన నీ లిక్కర్ స్కాం పార్టీని దెబ్బతీశాయన్నారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ ముందుకు పోతూ ఉంటే పార్టీని పలచన చేసే మాటలు మాట్లాడతవా? ? ఇకమీదట ఎక్కడ ఇలాంటి మాటలు మాట్లాడిన యావత్ తెలంగాణలో తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కెసిఆర్ ,కేటిఆర్ హరీష్ రావు మీద దుమ్మెత్తి పోయడానికి మెదక్ వరకు రావాల అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి మెప్పుకోసం, కాంగ్రెస్ పార్టీ మెప్పుకోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతవ అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎమ్మెల్సీ కవిత పూర్తిగా అవగాహన లేదన్నారు. మెదక్ జిల్లాలో కాళేశ్వరం రాకముందు పసుపులేరు హల్ది వాగు ఎలా ఉండే? హరీష్ రావుకు 400 ఎకరాలు రెడ్డిపల్లి లో ఉందని అసత్యపు, అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నావనీ పేర్కొన్నారు. రెడ్డిపల్లి లో హరీష్ రావు కు 400 ఎకరాలు ఉంటే రైతులకు పంచుదాం రావాలని కవితకు సవాల్ విసిరారు. రెడ్డిపల్లి వద్ద హరీష్ రావుకు 400 ఎకరాలు ఉందని, నిరూపించకపోతే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఒకనాడు మెదక్ ఎలా ఉండే? కెసిఆర్ వచ్చాక మెదక్ అభివృద్ధి ఎలా ఉందో చూసి మాట్లాడాలి అన్నారు. 2009లో పద్మాదేవేందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసింది వాస్తవం అన్నారు. అప్పుడే విదేశాలనుండి వచ్చావు నీకు పూర్తిగా ఉద్యమం గురించి తెలియదు అన్నారు.
రాజశేఖర్ రెడ్డి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆనాడు ప్రయత్నం చేస్తా ఉంది అన్నారు. ఆ సమయంలో పద్మాదేవేందర్ రెడ్డి. పార్టీని బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డది అన్నారు. మెదక్ అభివృద్ధి చెందింది పద్మా దేవేందర్ రెడ్డి వల్లే అన్నారు. రేవంత్ రెడ్డి మెప్పుకోసం, అక్రమ సంపాదన కోసం అక్రమ దందా కోసం ఇంత దిగజారి సోయి తప్పి మాట్లాడతావా? టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును విమర్శిస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొక తప్పదు అని కవితను హెచ్చరించారు. మీడియా సమావేశంలో మెదక్ హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజయ్య గౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఆర్కే. శ్రీనివాస్, భీమరి.కిషోర్, వంజరి జయరాజ్, మాయ మల్లేశం, నాయకులు ప్రభు రెడ్డి, జుబేర్ అహ్మద్, శ్రీను నాయక్, రంజిత్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.