తెల్లవారుఝామున రెండున్నర గంటలకు—దేశమంతా నిద్రలో ఉన్న వేళ
– కుమారస్వామిని వెంటబెట్టుకొని నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లి, పరిస్థితిని అత్యవసరంగా చంద్రబాబు నివేదించారు. అంతకు ముందు 1 గంటకు అమిత్ షాను కలిశారు చంద్రబాబు. ఆ అర్ధరాత్రి దాటాక చర్చలు అయిన అనంతరం, తెల్లవారుజామున 3 గంటలకు ఆర్థిక శాఖ స్వయంగా ట్వీట్ చేసింది.
కేవలం నిధుల కోసమే కాదు. 32 మంది అమరుల త్యాగంతో సాధించుకున్న ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు చేసిన తీవ్ర ప్రయత్నం అది. ఆ సమావేశం ఫలితంగానే, కేంద్రం RINLను NPA కాకుండా కాపాడేందుకు ₹10,300 కోట్ల ఈక్విటీ మరియు ₹1,140 కోట్ల రుణ సహాయంతో ముందుకు వచ్చింది.
దానికి ముందు ఏమి జరిగింది? 1992లో విశాఖ ఉక్కు కర్మాగారం ఆవిర్భవించింది. దేశానికి అవసరమైన రీబార్లు, వైర్ రాడ్లు, ఆటోమొబైల్ భాగాలు… అన్నింటికీ విశాఖ ఉక్కు అనేలా వెన్నెముకగా నిలిచింది. తిరిగి చూసుకోలేదు. 2000లలో సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి… ₹12,958 కోట్ల లాభాలు… ప్రధానమంత్రి ట్రోఫీ, నవరత్న స్థాయి… మన విశాఖ ఉక్కు దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఉత్పత్తి పెంచడానికి విస్తరణ ప్రణాళికలు సిద్ధం అయ్యి నిధులను రుణాలుగా తీసుకున్నారు. ఆ సమయంలో దురదృష్టం వెంటాడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంను మాంద్యం చుట్టుముట్టుంది. విస్తరణ అప్పులు దాని వడ్డీలు పెరిగాయి.
ముడి సరుకు కొరత… 2015 నుండి నష్టాలు మొదలయ్యాయి. 2024లో ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్తోనే కర్మాగారం నడవాల్సి దుస్థితికి వచ్చింది. అప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. ఉక్కు కార్మికుల గుండెల్లో భయం మొదలైంది. నిరసనలు మొదలెట్టారు. చంద్రబాబు సీఎం అయ్యారు. స్పందించి ఢిల్లీ వెళ్లి రోజంతా అందరినీ కలుస్తూ.. తెల్లవారుజామున అమిత్ షా, నిర్మలమ్మ సమయం దొరికితే వెళ్లి మన భావోద్వేగ ఆత్మగౌరవాన్ని తెలియజేసి, తక్షణ సాయం కోరారు. కేంద్రం సెప్టెంబర్ 2024లో అత్యవసరంగా ₹500 కోట్లు ఈక్విటీ, ₹1,140 కోట్లు రుణం, తిరిగి జనవరి 2025లో ₹9,800 కోట్లు కొత్త ఈక్విటీగా సర్దుబాటు చేసింది. ఫలితం జూన్ 2025లో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ వెలిగించారు.
సామర్థ్యం 79%కి చేరింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర గర్వం కోసం తన వంతు బాధ్యత తీసుకుంది. ₹2,400 కోట్ల విద్యుత్ బకాయిలను అక్టోబర్ 2025లో ఈక్విటీగా మార్చింది. పేరుకుపోయిన నీటి బిల్లులు రెండు సంవత్సరాల పాటు వాయిదా వేసింది. మే 2025లో 167 భద్రతా సిబ్బందిని ఉచితంగా పంపింది. రాష్ట్ర ప్రాజెక్టులన్నింటికీ విశాఖ ఉక్కును తీసుకోవడానికి ముందుకు వచ్చింది. కర్మాగారం నిలబెట్టడానికి అంతకు ముందు ఖర్చులు తగ్గించాలి అని 2020 నుండి ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ (VRS) అవకాశం ఇచ్చి, సిబ్బందిని సామర్థ్యానికి తగ్గట్టు పునర్వ్యవస్థీకరించబడ్డారు. ఇది కఠిన నిర్ణయం అయినా… ఖర్చులు తగ్గి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, కర్మాగారం నిలబడే మార్గంకోసం తప్పదు.
ఇటీవల ఇచ్చిన కేంద్ర రాష్ట్రాల మద్దతు తాత్కాలిక ఊరట మాత్రమే. మన ఉక్కు కర్మాగారం మళ్లీ లాభాల బాట పట్టాలంటే, ఆ పోరాట స్ఫూర్తిని, సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రతి ఉద్యోగి కష్టపడాలి. గతంలో ఎప్పుడైతే ప్లాంట్ రేటెడ్ కెపాసిటీకి మించి పనిచేసిందో, అప్పుడే లాభాలు గడించింది. కేంద్రం ఇచ్చిన నిధులతో 25% నుంచి 79%కి వినియోగ సామర్థ్యాన్ని పెంచగలిగారు. ఈ లక్ష్యాన్ని 100%కి చేరుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమించడం అత్యవసరం. దీర్ఘకాలికంగా నిలబడాలంటే, ఖర్చుల నియంత్రణ (Cost Optimization) తప్పనిసరి. ప్రభుత్వాలు వేల కోట్లు ఇచ్చినా, ఖర్చులపై కళ్లెం లేకపోతే, ఈ నిధులు పాత అప్పులు తీర్చడానికే, వడ్డీలకే సరిపోతాయి. తక్కువ ఉత్పత్తి సామర్థ్యం వల్ల ఇంధన రేటు, విద్యుత్ వినియోగం వంటి వేరియబుల్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి.
మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లను నడుపుతూ, సామర్థ్యం పెంచడం ద్వారా ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తికి అయ్యే ఖర్చు సహజంగానే తగ్గుతుంది. బ్యాంకులతో నిరంతరం చర్చలు జరిపి, లోన్ వడ్డీ రేటును 14.95% నుంచి 8.70%కి తగ్గించడం, బొగ్గు దిగుమతులను చేసుకోగలిగే వర్కింగ్ క్యాపిటల్ పెంచుకోగలిగే అత్యంత ముఖ్యమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించక తప్పదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటుతో పోటీపడడానికి కష్టపడుతోంది. ఆధునిక టెక్నాలజీ సమకూర్చడానికి సమర్థవంతంగా పని చెయ్యక తప్పదు. అది 5జీకి వచ్చే సరికి ప్రపంచం 6జీకి వెళుతుంది.
ప్రజలు వేచి చూడరు. ప్రస్తుతానికి “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” నిలిచి గెలిచింది! యాజమాన్యం, కార్మికులు కాపాడుకోవాలి. ఓటు బ్యాంకు, రాజకీయ సమస్యగా మార్చి, అవాస్తవాలు ప్రచారం చేస్తే.. వాటిని నమ్మి గొడవలు చేస్తే.. రోజూ పొద్దున గేటు వద్దకు సీఎం చంద్రబాబు వచ్చి అటెండెన్స్ వేసుకుని, మైకులో “ప్రైవేటుకు ఇవ్వడం లేదని” చెప్పి వెళ్లలేరు. రోజుకొక తప్పుడు ప్రచారం నమ్ముతూ గొడవలు చెయ్యడమే కాకుండా.. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సిఐఐ సదస్సులోకి వెళ్లి సమాధానం చెప్పమని చికాకు పెడితే.. దాని కోసం కష్టపడ్డ ఎవరికైనా చిరాకు వస్తుంది. ఆ స్టీల్ ప్లాంట్ అమ్మేసి, రాష్ట్ర వాటా స్థలంలో రాజధాని పెడితే బావుంటుంది అని, నాడు దాని మీద కన్నేసిన జగన్, ఏ రోజైనా దాని గురించి పట్టించుకున్నాడా? అలా చంద్రబాబు వదిలెయ్యడు. ఆ తేడా తెలుసుకోండి. ప్రజలకు కూడా చికాకు కల్పించకండి. మన ఆత్మగౌరవం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, కాస్త మనసు పెట్టి కష్టపడండి.

