Suryaa.co.in

Andhra Pradesh

వామ్మో.. ఇంత పెద్ద తిమింగలమా.. అయ్య బాబోయ్!

సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన బ్లూ వేల్ డెడ్ బాడీ

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లోని పాత మేఘవరం  డి.మరువాడ సముద్రతీరాల మద్యకు భారీ నీలి తిమంగలం కొట్టుకువచ్చింది. చూడటానికి ఇది సుమారు 25 అడుగుల పొడవు,ఐదు టన్నులు బరువు ఉంది.

ఇది మృతి చెంది ఉంది. ఈ నీలి తిమంగలం బ్లూ వేల్ అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో ఈ నీలి తిమంగలం చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టూ పక్క గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.

నీలిరంగుతో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ క్రమంలోనే నిలి తిమింగలం చనిపోయి ఉంటుందని మత్స్యకారులు భావిస్తున్నారు.

LEAVE A RESPONSE