ఇటు ముందు ఓపెన్ ఏఐతో తరువాత అటు వారి రైవల్ గూగుల్ తో.. వాహ్! నైన్టీస్ నాయుడి రోజులు చూస్తున్నాం!
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి!
-ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస నారాయణన్ తో మంత్రి లోకేష్ భేటీ!
మంత్రి లోకేష్ స్పష్టంగా చెప్పారు:
“ప్రతి కుటుంబంలో ఒక AI ఆధారిత సభ్యుడు ఉండాలి… అదే మా లక్ష్యం. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం ఓపెన్ ఏఐ మాతో చేతులు కలపాలి.”
తొలి దశలోనే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల పిల్లలకు ఉచిత చాట్ జీపీటీ అందించాలన్న ఆలోచనను ఆయన వెల్లడించారు.
అంతేకాక, ఏపీలో ప్రత్యేక AI విశ్వవిద్యాలయం స్థాపనకు ఓపెన్ ఏఐ సహకారం కోరారు.
డేటా సెంటర్ హబ్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఓపెన్ ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు ఎంపిక చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస్ నారాయణన్ మాట్లాడుతూ.. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి ఎంటర్ప్రైజ్ AI ఇంటిగ్రేషన్ చేస్తున్నామని తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ 180 దేశాల్లో సేవలు అందిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే…
$90 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన చాట్ జీపీటీ సంస్థ గత ఏడాది $3.5 బిలియన్ ఆదాయం ఆర్జించింది.
ఆంధ్రప్రదేశ్‌లో AI విప్లవానికి నాంది పలికే ఈ భేటీ… విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపనుంది!