– మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు
నందిగామ: హిందూ దేవుళ్ళపై ఉన్న నమ్మకం ఏ పాటిదో ఈ వైకాపా నేతలు నిరూపించు కుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ వడ్డించారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.