Suryaa.co.in

Andhra Pradesh

సర్కారును అప్రతిష్ఠపాలు చేసేందుకు వైసీపీ కుట్ర!

• ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఇసుక బోట్లతో ప్లాన్
• కుట్ర వెనుక జగన్, సజ్జల, నందిగం, తలశిల
• పాత్రధారులతో పాటు సూత్రధారులను అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్

మంగళగిరి: జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఇసుక బోట్లతో కుట్రపన్ని.. ప్రజల ధన, మాన ప్రాణాలు తీసి.. చట్టబద్ధంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారని.. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశిల రఘురాంల ప్లాన్ ఉందని.. పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

– వరదకు ముందు రోజు ఉద్దండరాయుని పాలెంలో ఉన్న పడవలను కావాలనే ప్రకాశం బ్యారేజ్ వైపుకు తెచ్చి.. బ్యారేజ్ ను ఢీ కొనే విధంగా నిలబెట్టారు. ఆ బోట్లు సరిగ్గా బ్యారేజ్ ను ఢీకొని ఉంటే.. దివిసీమ ఉప్పెన కంటే ప్రమాదం ఘోరంగా ఉండేది.. వందల ఊర్లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయేవి.
– దాదాపు 20 లక్ష ఎకరాల సాగును నాశనం చేసేందుకు కుట్ర చేశారు. వైసీపీ నేతల అధికార దాహానికి ప్రజల ప్రాణాలను బలిచేయాలని చూశారు. దీనిపై అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేయాలి. దీన్ని దేశద్రోహ నేరంతో సమానంగా భావించి ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలి. ఈ కుట్రపై డీజీపీ ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇంత విధ్వంసానికి కుట్ర చేసిన వారిని విడిచిపెట్టకూడదు.
– జగన్ గత ఐదేళ్ల పరిపాలన అంతా అరాచకం, అస్తవ్యస్తం. కుట్రలు కుతంత్రాలతోనే జగన్ పాలన సాగింది. ఆయన పాలన అంతా నేరపూరితమే. గతంలో అధికారంలోకి రావడానికి జగన్ ఎన్నో క్రిమినల్ ఆలోచనలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం బాబాయిని గొడ్డలి వేటుకు బలిచేశారు.. ఆ కేసును అడ్డుకునేందుకు సీబీఐ అధికారులపై కూడా కేసులు పెట్టించారు.
– కోడి కత్తి కేసులో దళిత యువకున్ని బలిచేశారు.. ఐదేళ్లు శీను జైల్లో మగ్గటానికి జగన్ రెడ్డే కారణం. తునిలో రైలును దగ్ధం చేశారు.. ఇవి జగన్ రెడ్డి, సజ్జలకు తెలియకుండా జరగలేదు. అధికారం నిలబెట్టుకోవడానికి నానా గడ్డి తినేలా 2024 ఎన్నికల ముందు గులకరాయి డ్రామాకు తెరలేపారు.
– ఏదైనా చేసి అధికారం పొందాలని పన్నాగం పన్నారు. ఎప్పుడు లేని విధంగా రికార్డులను తగలబెట్టి.. తప్పుల నుండి తప్పించుకోవాలని చూశారు. రాజకీయ లబ్ధీ కోసం పింఛన్ లు ఇవ్వకుండా ఎండల్లో తిప్పి 33 మంది అవ్వాతాతల చావుకు కారణం అయ్యారు.
– ఈ క్రిమినల్ ఆలోచనలతోనే నేడు ప్రకాశం బ్యారేజ్ కు ఎసరు పెట్టాలని చూశారు. ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టిన పడవలకు వైసీపీ రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించడానికి వెనుకాడని వ్యక్తి బ్యారేజ్ పై కుట్ర చేయలేదంటే ఎవరు నమ్ముతారు?
– నేడు వరద బాధితులకు చంద్రబాబు ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకున్నారు.. బురదలో తిరిగి ఆయన బాధితులకు భరోసా కల్పించారు. జగన్ అధికారంలో ఉంటే అల్లాడే వాళ్లమని బాధితులే అంటున్నారు. ముద్రగడ పద్మనాభంను కులం మార్చుకునేలా చేసిన ఘనత జగన్ రెడ్డిదే.
– ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి కుట్ర పన్నిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కటకటాల్లో ఉంటే… జగన్ వెళ్లి ఆయన్ను రామర్శించాలనుకోవడం సిగ్గుచేటు.. సరేష్ ను పరామర్శించడంపై జగన్ మరోసారి పునరాలోచించాలి.
– ప్రకాశం బ్యారేజ్ కు ఎసరు పెట్టిన వ్యక్తులు మున్ముందు ఏదైనా చేయవచ్చు. అధికారులు, ప్రజలు వారి కుట్రపూరితమైన ఆలోచనలపై అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూడా ఇది కుట్ర అని.. ఇసుక పడవలు ఢీ కొన్నదాని వెనుక ఎవరు ఉన్నా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE