కుట్రలు కొనసాగిస్తున్న వైసీపీ
– అభివృద్ధిపై విషం కక్కుతున్న అరాచకం
– ఓడించినా మారని వైసీపీ కుట్ర బుద్ధి
– రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలపై బురద జల్లుతున్న వైసీపీ
– రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేకపోతున్న కుట్రల పార్టీ.
– తాజాగా వోల్ట్ సన్ ల్యాబ్స్ సంస్థపై అడ్డగోలు ఆరోపణలు
– కియా, గూగుల్ వంటి సంస్థలకిచ్చే రాయితీల పైనా ఇదే తరహా ఆరోపణలు గుప్పించిన జగన్ మోహన్ రెడ్డి
వోల్ట్ సన్ ల్యాబ్స్ విషయంలో వాస్తవాలివి..
వోల్ట్ సన్ ల్యాబ్స్ ఏదో అల్లాటప్పా సంస్థ కాదు… కేవలం భూముల కోసమో.. లేక ఇతర అవసరాల కోసమో స్థాపించిన సంస్థ అంతకంటే కాదు. ప్రపంచవ్యాప్తంగా రవి జైపురియా నేతృత్వంలో పని చేస్తున్న RJ Corp గ్రూప్‌కు మంచి పేరుంది. రూ. 90,000 కోట్లకు పైబడిన RJ Corp గ్రూప్ సంస్ధకు వివిధ రంగాల్లో ప్రావీణ్యత ఉంది… ఆయా రంగాల్లో ప్రముఖ సంస్థగా వెలుగొందింది. ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, పెప్సీకో బాట్లింగ్ భాగస్వామిగా, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, కాస్టా కాఫీ వంటి ప్రధాన క్యూఎస్ఆర్ బ్రాండ్లను ఫ్రాంచైజీ రూపంలో నడిపే సంస్థగా, RJ Corp గ్రూప్‌కు పాపులారిటీ సంపాదించుకుంది.
వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ (Varun Beverages Ltd – VBL) అనేది RJ Corp గ్రూప్ యొక్క ఒక ప్రధాన సంస్థ (Flagship Company), దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సంస్థ కూడా RJ Corp గ్రూప్ సంస్థలే. RJ Corp గ్రూప్‌కు… ఈ గ్రూప్‌కు చెందిన వివిధ సంస్థలు ఇండియాతోపాటు… దుబాయ్, థాయ్ ల్యాండ్, మొరాకో వంటి దేశాల్లో కూడా వ్యాపార కార్యాలపాలు నిర్వహిస్తున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పేరున్న సంస్థ.. అలాగే ఆర్ధికంగా కూడా చాలా హైవర్తీ ఉన్న సంస్థ RJ Corp గ్రూప్.
అలాంటి మంచి పేరున్న RJ Corp గ్రూప్… పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి అడుగు పెట్టింది. గత కొంత కాలంగా పునరత్పాదక విద్యుత్ రంగానికి ప్రపంచంలో డిమాండ్ పెరుగుతుంది. కాలుష్యం బారిన పడకుడా.. పర్యావరణ హితంగా ఉండేలా విద్యుత్ ఉత్పత్తి చేసేలా భారత దేశంతో సహా వివిధ దేశాలు గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఈ క్రమంలో ఏపీ కూడా గ్రీన్ ఎనర్జీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది.. మెరుగైన పాలసీలు రూపొందించింది. అలాగే ఆ రంగానికి చెందిన సంస్థలకు ప్రొత్సహాకాలు ప్రకటించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ సంస్థలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇంత మంచి పేరున్న కంపెనీ.. రూ. 90 వేల కోట్ల టర్నోవర్ తో బిజినెస్ చేసే RJ Corp గ్రూప్ ఏపీలోని 37 ఎకరాల కోసం వోల్ట్ సన్ అనే సంస్థను స్థాపించిందని అడ్డగోలు ఆరోపణలు రాస్తున్నారు.. అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. రవి జైపురియా RJ Corp గ్రూప్ లో భాగమైన వోల్ట్‌సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏదో అనామక కంపెనీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.
తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఏంపీఎస్ఈసీలో 1,743 కోట్లు పెట్టుబడి పెట్టి గ్రీన్‌ఫీల్డ్ సౌర సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది… 2025 నవంబర్ 15న జారీ చేసిన G.O. Ms. No. 222 జీవో జారీ చేసింది. ఇక ప్రభుత్వ పాలసీల్లో భాగంగా ప్రాజెక్టు వేగంగా ప్రారంభం కావడానికి రాయితీలను ప్రకటింది. వోల్ట్ సన్ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టు అధునాతన, హై-వాల్యూ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి తయారు చేయనుంది. ఈ గ్రూప్ అత్యాధునిక సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా ఎంచుకోవడం, రాష్ట్ర పాలన, విధానాలు, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”పై గ్రూప్‌కు ఉన్న నమ్మకం.
ఈ సంస్థ 2 GW సమగ్ర సౌర తయారీ ఎకోసిస్టమ్ వోల్ట్‌సన్ ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు. ప్రతి దశలో 1 GW సౌర సెల్ సామర్థ్యం, 1 GW మాడ్యూల్ సామర్థ్యంతో, అత్యాధునిక టాప్కాన్ మోనోక్రిస్టలైన్, బైఫేషియల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఈ పెట్టుబడి ద్వారా 415 ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. ప్రాజెక్ట్‌కు కావాల్సిన 40 MW విద్యుత్, 3 MLD నీటి సరఫరా, అలాగే ఒక క్యాప్టివ్ సౌర ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ప్రాజెక్టు నిరంతర, వేగవంతమైన అమలుకు ఏపీ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ పాలసీ 2024–29 కింద ప్రత్యేక రాయితీలు SIPB ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ — భారతదేశం పునరుత్పాదక శక్తి కేంద్రంగా ఆర్జే కార్ప్ వంటి ప్రపంచస్థాయి కన్గ్లోమెరేట్ సౌర తయారీ రంగంలోకి అడుగుపెట్టడం, ఆంధ్ర ప్రదేశ్‌ను దేశంలో పునరుత్పాదక శక్తి శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు. ఇప్పటికే సౌర మాడ్యూల్ తయారీదారులు, పంప్డ్ స్టోరేజ్ డెవలపర్లు, గ్రీన్ హైడ్రజన్ ఎకోసిస్టమ్ సంస్థలు ఉన్న రాష్ట్రంలో ఈ పెట్టుబడి క్లీన్టెక్ క్లస్టర్‌ను మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇలా మంచి పేరున్న సంస్థకు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాయితీలిస్తే.. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ… రాష్ట్రానికి మేలు జరగ్గుకుండా.. కంపెనీలు రాకుండా.. భయ భ్రాంతులకు గురి చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. రాష్ట్రంలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎలా పని చేస్తారో చూస్తా.. రాజధానిలో పెట్టుబడులు పెడితే వారిని తరమికొడతానన్న జగన్ మోహన్ రెడ్డి నుంచి ఇంతకు మించి ఆశించలేం. రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తుంటే… రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా వైసీపీ కుట్రలు.. కుతంత్రాలు పన్నుతోంది. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా అవి చెల్లుబాటు కావనే విషయం ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సుతో తేలిపోయింది.
– రైతుబిడ్డ