– బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
విజయవాడ: కూటమి ప్రభుత్వం 100రోజుల పరిపాలన అలాగే మూడోసారి మోదీ ప్రధాని దేశ అభివృద్ధి. ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్రం సహాయ సహకారాలు అందించటం. పోలవరం నిర్మాణం , రైల్వే జోన్ లు , విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు నిర్ణయాలు. ప్రతినెల 1వ తేదీన పెన్షన్స్ పంపిణి, ఉద్యోగస్తులకి టెన్షన్ గా జీతాలు ఇస్తున్నాం.
జల జీవన్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నారు.గ్రామ పంచాయతీ ల అభివృద్ధి కొరకు, రాష్ట్రానికి కేంద్రం నుంచి పేదల కొరకు ఇళ్ళు నిర్మాణం కోసం నిధులు కేటాయించారు.వైసీపీ డైనోసర్ పార్టీ. తిరుమల లడ్డు లో కల్తీ చేసి అవినీతికి పాల్పడ్డారు. గత ప్రభుత్వ పాలన దోపిడీ విధానాన్ని అవలంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి దిశగా వెళ్తుంది.
పారిశ్రామిక వాడలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి, ఎయిర్పోర్ట్ ఆధునికరణ ఇలా అనేక విధాలుగా రాష్ట్రం అభివృద్ధి కొరకు నిధులు కేటాయిస్తూనే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త సమన్వయంతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తాయి. ఎడ్యుకేషన్ కు కూడా కావలసిన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్న కాంటీన్ లో 5 రూపాయలకు మంచి భోజనం అందిస్తున్నాం. ఓటరు పాస్ ఐనాడు, జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ ఐనాడు. జమిలి ఎన్నికలు మంచి నిర్ణయమే.
పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.