Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి విపక్ష పాత్ర కూడా దక్కదు

-ఇవి జనం నాడి తెలిపే ఫలితాలు
-పోలీసుల వేధింపులు ఇక చెల్లవ్‌
-మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు: వైసీపీ అధికారంలోకి వచ్చి4సం. లుగా బయపెట్టడం, అక్రమ కేసులు పెట్టడం చూసి విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల లో తగిన గుణపాఠం చెప్పారు.గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకొని అక్రమ విజయాలు సాధించారు.పట్టభద్రుల కానివారిని ఓటర్లుగా నమోదుచేసి దొంగఓట్లు దాడులు చేసినా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు ఒడ్డి విజయం సాధించారు.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను బెదిరించి గెలుపులు సాధించడం ఒక విజయమేనా అని ప్రశ్నించారు.అవినీతి, అక్రమాలు,వెండి నాణాలు పంచి,డబ్బులు పంచినా ఓటర్ల వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించారు.రాష్ట్ర ప్రగతికోసం చేయి చేయి కలిపిన ప్రజా విజయం సాధించారు. సీఐడీ కేసులు, పోలీసు కేసులు పెట్టి పాలన గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు.ఎవరు పోటీ చేసిన రెండవ ప్రాధాన్యత ఓటు టీడీపీ పార్టీకి వేసి, వైసీపీ పార్టీపై వ్యతిరేకతను తెలియ చేసిన ప్రజలు, విద్యావంతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనటానికి ఈ ఎన్నికలే ప్రధాన సాక్ష్యం.ప్రజలు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రతిపక్ష హోదాకుడా ఇవ్వరని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నరకాసుర పాలనకు అంతం చేయడానికి అందరి సహకారం తీసుకుంటాం.

LEAVE A RESPONSE