అనంతపురం జిల్లా (రాప్తాడు) : రైతు సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా రామగిరిలో మాజీ మంత్రి, పరిటాల సునితమ్మ ఆందోళనకు దిగారు.రైతులకు రాయితీలు ఇవ్వకుండా.. వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
రైతు సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా రామగిరిలో మాజీమంత్రి పరిటాల సునీత ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం రైతులకు రాయితీలు ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు.పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలతోపాటు పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
పింఛన్లు ఇష్టానుసారం రద్దు చేస్తున్నారు: పరిటాల శ్రీరామ్
చేనేత కార్మికుల పింఛన్లు ఇష్టానుసారం రద్దు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిటాల శ్రీరామ్ విమర్శించారు.ప్రభుత్వం తీరుతో రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ధర్మవరంలో 75శాతం మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
పింఛన్ల సర్వే పేరిట అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నరాంటూ శ్రీరామ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెరిగిన ముడి సరుకు ధరలతో చేనేత రంగానికి కార్మికులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెరిఫెడ్ ద్వారా రాయితీలు కల్పించి ఆదుకోవాలని కోరారు.