Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో పరాకాష్టకు చేరిన వైకాపా వేధింపులు

పోలీసుల వేదింపులతో మరో దళిత యువకుడు బలి
హోం మంత్రి దళితురాలై ఉండి ఆమె సొంత నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదు
– తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు

వైకాపా అరాచకాలు పరాకాష్టకు చేరాయి. రాష్ట్రంలో దళితులపై దాడి జరగని రోజు లేదు. అసాంఘిక శక్తులు మొదలు కొని పోలీసులు దాక అనునిత్యం ఏదో ఒక రూపంలో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, దొమ్మెరుకు చెందిన దళిత యువకుడు బొంత మహింద్రను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి దాడికి పాల్పడ్డారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మహీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

దళితులంటే వైసీపీ నాయకులకు, పోలీసులకు లెక్కలేకుండా పోయింది. దీనంతటికీ కారణం సీఎం జగన్ రెడ్డి ఉదాసీన వైఖరే కారణం. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు నిత్యకృత్యంగా జరుగుతూ ఉన్నా చర్యలు శూన్యం. మొన్న నందిగామలో శ్యామ్ పై జగన్ సామాజికర్గానిక చెందిన యువకులు మూత్ర విసర్జన చేసి అవమానించారు. దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించి పార్టీ సభలు, సమావేశాల్లో జగన్ తన పక్కనే తిప్పుకుంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గ కేంద్రంలోనే దళిత మహిళ నాగమ్మ పై అత్యాచారం చేసి హత్య చేసినా చర్యలు లేవు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలో అసలు నిందితుడు వెంకట్ రెడ్డిని ఇంతవరకు అరెస్టు చేయలేదు.

హోం మంత్రి సొంత నియోజకవర్గంలో దళిత యువకుడిపై పోలీసులు వేధింపులకు పాల్పడుతారా? హోం మంత్రి దళితురాలై ఉండి దళితులకు ఒరిగింది ఏమిటీ? మహేంద్రను అకారణంగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని, విడిపించాలని మహేంద్ర కుటుంబ సభ్యులు వైసిపి పెద్దలను ప్రాధేయపడినా కనికరించలేదు. వైకాపా దళిత మంత్రులు ఉన్నది జగన్ రెడ్డికి బాకా ఊదడానికా? లేక ప్రజలను రక్షిచడానికా? జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 28 మంది దళితులను పొట్టనబెట్టుకున్నారు.

ఆరు వేల మంది దళితులపై దాడులకు పాల్పడ్డారు. దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపైన్నే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విదేశీ విద్య, ఎన్టీయార్ స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవలబుల్ స్కూల్స్ వంటివాటిని రద్దు చేసి దళితులు విద్యా పరంగా ఎదగకుండా అడ్డుకున్నారు. మరో వైపు సంక్షేమ పథకాలను నిలిపేసి వారిని ద్రోహం చేశారు. సెంటు పట్టా భూమితో దళితుల అసైన్డ్ భూములను లాక్కున్నారు.

వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి దళిత యువతకు ఉపాధి లేకుండా చేశారు. 15 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి చనిపోయినవారిలో 12 మంది దళితులే. ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యుల నియామకంలో దళితులకు అన్యాయం చేశారు. సలహాదారులుగా దళితులు పనికిరారంటూ అసెంబ్లీ సాక్షిగా దళిత జాతిని జగన్ అవమానించారు. దళితులను అన్ని విధాల వేధిస్తున్న జగన్ రెడ్డికి దళితులు బుద్ది చెప్పాలి.

LEAVE A RESPONSE