Suryaa.co.in

Andhra Pradesh

శవ రాజకీయాలకు పేటెంట్ వైసీపీదే

చిత్తు చిత్తుగా ఓడించినా వైసీపీ తీరు మారలేదు
టీడీపీ దాడులు చేస్తోందంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలి
– టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు, శవ రాజకీయాల పార్టీ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు.

గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తు చిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుంచే సిగ్గు లేకుండా శవ రాజకీయాలు మొదలు పెట్టారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటు. వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు, శవ రాజకీయాల పార్టీ. సీఎం పదవి కోసం తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించింది జగన్ మోహన్ రెడ్డి. ఎవరూ చనిపోకపోయినా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేసింది జగన్ రెడ్డి. 2019 లో బాబాయి శవాన్ని అడ్డుపెట్టుకుని శవ రాజకీయం చేసింది జగన్ రెడ్డి.మీ ప్రభుత్వంలో పల్నాడులో తోట చంద్రయ్యను గొంతు కోసి చంపారు.

కంచర్ల జల్లయ్య యాదవ్ ని హత్య చేశారు, వీటిని దాడులు, హత్యలు అంటారు. దాచేపల్లిలో కాపు సామాజికవర్గానికి చెందిన పురంశెట్టి అంకుల్ ని కిరాతకంగా హత్య చేశారు, హత్య అని దీన్ని అంటారు.అలాగే రేపల్లెలో బీసీ బాలుడు అమర్నాద్ గౌడ్ ను పెట్రోసి పోసి తగుల పెట్టి చంపారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ దాడి చేశాడు.మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు.వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరి చేసిన చర్యలు లేవు.

మాస్క్ అడిగిన పాపానికి దళిత డా. సుధాకర్ ను వేధించి చంపారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిన చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను హత్య చేశారు. దాడులు, హత్యలు అంటే ఇవి.ఎన్నికల రోజు కూడా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్లలో దాడులు చేసింది వైసీపీ. టీడీపీ దాడులు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తే ఖబడ్డార్…. వైసీపీ నేతలు శవ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని అనురాధ హెచ్చరించారు

 

LEAVE A RESPONSE