Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం

  • కమీషన్లు, ప్రజల సొత్తు లూటీపైనే దృష్టి పెట్టి వ్యవస్థలను కుప్పకూల్చారు
  • సిగ్గు, శరం లేకుండా ఈ రోజుకీ మమ్మల్ని తిడుతూ గడుపుతున్నారు
  • పొదలకూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  • ఐదేళ్ల తర్వాత ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
  • ఎస్సీ బాలుర హాస్టల్ పరిశీలన..పరిస్థితులు దుర్భరంగా ఉండటంపై ఆవేదన
  • మీడియాతో మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు: నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుస్తకాల పంపిణీ జరగడం ఆనందదాయకం.వైసీపీ పాలనలో ఐదేళ్లు నాడు –నేడు అంటూ గడిపేశారు. చివరకు నాడు లేదు..నేడు లేదు. ఏ రంగంలో చూసినా ఘోరమైన వైఫల్యాలే కనిపిస్తున్నాయి.

పొదలకూరు లో ఎస్సీ హాస్టల్ ను పరిశీలిస్తే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సీఎం కానీ, మంత్రులు కానీ ఏనాడైనా శాఖల వారీగా సమీక్షలు పెట్టి ఏడ్చారా…ఏ రోజైనా సచివాలయం వెళ్లారా?మంత్రులుగా వెలగబెట్టిన వారి శాఖలపై కనీస అవగాహన ఉందా?

ఎక్కడ ఎంత కమీషన్లు వస్తాయి..ప్రజల సొత్తును ఎలా లూటీ చేయాలనే ఆలోచన తప్ప ఒక్క మంచి పనైనా చేశారా? మొత్తంగా ఐదేళ్లలో వ్యవస్థలను కుప్పకూల్చారు. కొంచెం కూడా సిగ్గు, శరం లేకుండా ఇప్పుడు కూడా మమ్మల్ని తిడుతూ గడిపేస్తున్నారు.

LEAVE A RESPONSE