రాజమండ్రి ఎంపి భరత్ రామ్
విశాఖ పట్నం/ రాజమండ్రి, ఏప్రిల్ 2, 2023 పనీపాటా లేని ప్రతి పక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజా మహేంద్ర వరం లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం రాజమండ్రి లో జరిగిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా తో మాట్లాడారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద దిక్కు గా ఉన్నారన్నారు. ప్రస్తుత పాలన తో ఏ పీ లోనీ ప్రజలు అందరూ ఎంతో సంతోషం గా ఉన్నారన్నారు. సాధారణ ఎన్నికలు జరిగే సమయంలోనే ఏ పి లో కూడా శాసన సభ ఎన్నికలు జరుగుతాయనీ అన్నారు.
ప్రశాంతం గా ఉన్న రాష్ట్రాన్ని , రాష్ట్ర ప్రజలను అతలా కుతలం చేసేందుకు. ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా గొడవలు పెట్టీ, ప్రజల్లో భయాన్ని కల్గిస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్తితి అనే సాకు తో జగన్ ముందస్తు ఎన్నికల కు వెళ్తారు అంటూ దుష్ట ప్రచారం చేస్తున్నారన్నారు. ఇవేవీ పట్టించుకునే తీరిక ప్రజల దగ్గర లేదన్నారు. తామువచే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లు గెలిచి ఈ సారి ప్రపంచ రికార్డు సృష్టి స్తామన్నారు.