– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సత్యంని చంపేసి, ధర్మంని చెరపట్టామని వైకాపా కాలకేయులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతిమంగా గెలిచేది సత్యమే. మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రగతి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలపై సైకో జగన్ సర్కారు విరుచుపడింది.
శ్రీకాళహస్తిలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం నియంతృత్వమే. కుప్పం, గుడిపల్లిలోనూ టిడిపి కేడర్ పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అధినేత చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిస్తున్న వారిపై అప్రకటిత యుద్ధం చేస్తోంది ఈ సైకో జగన్ సర్కారు.
కోట్లాది మంది ఆశీస్సులు, నిజాయితీ మన చంద్రబాబు గారిని కడిగిన ముత్యంలా మనకి అందిస్తుంది. కోపతాపాలు వద్దు. సంయమనం పాటించండి. తెలుగు దేశం పార్టీ మీ వెనక ఉంది.