Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వైసిపి నేతలు, కార్యకర్తలు

– వైసీపీ కార్యకర్తల చర్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
– పాదయాత్రగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అన్న క్యాంటీన్ కు వచ్చిన టిడిపి అధినేత
– అన్న క్యాంటీన్ పై వైసీపీ నేతల దాడిని వివరించిన స్థానిక టిడిపి నేతలు
– వైసీపీ నేతల చర్యలకు నిరసనగా….అన్న క్యాంటీన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత
– కుప్పం నుంచి ధర్మపోరాటానికి నాంది
– నా శైలికి భిన్నంగా ఇకపై కఠినంగా వెళ్లాల్సిన అవసరం ఉంది

కుప్పం: అన్న క్యాంటీన్ వద్ద టిడిపి అధినేత చంద్రబాబు ఏమన్నారంటే..ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక చీకటి రోజు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చెయ్యడం నీచం. వీధి కొక రౌడీని తయారు చేసిbabu-canteenప్రజలపైకి ఉసిగొల్పుతున్నారు. పోలీసులు సరిగా ఉండి ఉంటే అన్న క్యాంటీన్ ను ఇలా ద్వంసం చేసేవారా? ఎస్పీ ఎక్కడ ఉన్నాడు…..ఏం చేస్తున్నాడు? మా వాళ్లు కూడా దాడులకు దిగితే ఏం చేస్తారు? మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.

పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా దాడి చేశారు….మరి పోలీసులు ఏం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా….పోలీసులు ఉంది మాపై దాడులు చెయ్యడానికా?అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వారిని పోలీస్kuppam స్టేషన్ కు తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకువెళతారా? మూడేళ్లుగా జరుగుతున్న గ్రానైట్ అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నాం…..బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నాం. మూడేళ్లలో అనేక చోట్ల నా పర్యటనలకు అడ్డంకులు సృష్టించారు. కోర్టు కూడా చీవాట్లు పెట్టింది.అప్పుడే పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది…మా ఇంటికి వచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి జగన్ మంత్రులను చేశాడు.

దాడులు చేసి భయపెట్టి గెలవాలి అనుకుంటున్నారు..ఇలాంటి దాడులకు టిడిపి భయపడేది లేదు. పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తను ప్రజలకు, మీడియాకు చూపించి ప్రశ్నించిన టిడిపి అధినేతkuppam1 వైసీపీ, పోలీసులపై న్యాయ పరంగా పోరాడుతా…రాజకీయంగా కూడా పోరాడుతా.కొందరు పోలీసులు కంటే బ్రిటిష్ వాళ్లే నయం అనిపించింది. వాళ్ల ప్రవర్తన అలా ఉంది.

ప్రజలు మౌనంగా ఉంటే వారి ఇంటి వరకు రౌడీలు వస్తారు. చైతన్య వంతంగా ఉండి పోరాడాలి.వైసీపీ పతనం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కుప్పం నుంచి ధర్మపోరాటానికి నాంది. కుప్పంలో నేడు సిగ్గుkuppam2 లేకుండా ఆర్టిసి బస్సులు నిలిపివేశారు…స్కూళ్లు మూసి వేశారు. ఏంటి ఇవన్నీ? నా శైలికి భిన్నంగా ఇకపై కఠినం గా వెళ్లాల్సిన అవసరం ఉంది…అందుకే ఇలా మట్లాడాల్సి వస్తుంది.

ఎక్కువ కాలం మా కార్యకర్తలను కట్టడి చెయ్యడం కూడా సాధ్యం కాదు. వైసిపి వాళ్లు కూల్చిన దగ్గరే అన్న క్యాంటీన్ లో భోజనం పెడుతున్నా. ఈ సారి మాపై దాడి జరిగితే….వాళ్ల ఇంటికి వెళ్లి కొడతాం. అన్నం పెట్టే వాడిపై చెయ్యి చేసుకోవడం నీచం…కన్నతల్లిపై దాడి చేసినట్లే.పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై దాడిని తీవ్రంగా తీసుకుంటున్నాం.
అన్న క్యాంటీన్ ఇక్కడే కొనసాగుతుంది.

LEAVE A RESPONSE