– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆందోళన
మంగళగిరి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా విమర్శించారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు బెయిల్ పై విడుదల కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆరాచక పార్టీలాగా కనిపిస్తుంది. ఇది రాజకీయం కోసం ప్రజా సేవ కోసం ఏర్పడిన పార్టీ కాదు. అవినీతి సొమ్మును దాచుకోవడం కోసం, ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవడం కోసమే రాజకీయ పార్టీ పెట్టారని అన్నారు.
మద్యం కుంభకోణంలో రూ. 3,500 కోట్లు ప్రజా సొమ్ము కొట్టేశారని, సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ వేసిందని చెప్పారు. ఈ కేసులో పెద్ద పెద్ద బడా తలలు ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారులు, భారతీ సిమెంట్ డైరెక్టర్ 110-117 రోజులు జైలులో ఉన్న తర్వాత బెయిల్ పొందడంపై ప్రశ్నలు లేవనెత్తారు. రూ.100 కోట్ల మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 160 రోజులు జైలులో ఉన్నారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 530 రోజులు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత 160 రోజులు ఉన్నారు. కానీ ఇక్కడ రూ.3,500 కోట్ల కుంభకోణంలో 114-117 రోజుల్లోనే బెయిల్ వచ్చిందన్నారు. ధనుంజయ రెడ్డి డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేశారని, జగన్ ఫైళ్లు చూడకుండా ఆయనే నిర్ణయాలు తీసుకునేవారని ప్రజావాక్కుగా చెప్పారు.
విజయవాడ జైలు వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడి, పోలీసులపై దాడి చేయడం, బారికేడ్లు దాటడం వంటి ఆరాచకాలు సృష్టించారని ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధులను రిసీవ్ చేసుకున్నట్లు వచ్చారు. కానీ వీళ్లు ప్రజా సేవ చేసినవారు కాదు. రూ.3,500 కోట్లు కొట్టేసిన నిందితులన్నారు. జైలు అధికారులు, పోలీసులను దూషించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేస్తూ బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మద్యం కుంభకోణంలో కల్తీ మద్యం తాగి 30 వేల మంది చనిపోయారు. 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. మీరు దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యులన్నారు. విదేశాల్లో దాచిన సొమ్మును రికవరీ చేసి బాధితులకు చికిత్స అందించాలని సూచించారు. చెవిరెడ్డి వంటి వారి ఆగడాలను కట్టడి చేయాలని అవసరమైతే ఇతర జైళ్లకు మార్చాలని కోరారు. జగన్ పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోండి.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం తోలు వలిచేస్తుంది అని హెచ్చరించారు. ప్రతి శుక్రవారం నన్ను కోర్టు పిలవడం లేదని జగన్ అనుకుంటున్నారెమో..ఏ ఒక్క కేసు కూడా మిమ్మల్నీ వదిలి పోలేదు. మీ శేష జీవితం ప్రశ్నాకరంగా ఉందని ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైన ప్రతి అడుగు హుందా వేసి పార్టీ అధ్యక్షుడిగా వ్యహరించాలి గాని కిల్లర్ గా వ్యవహరించోద్దని విమర్శించారు