-మంత్రి కొడాలి లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలి
-రాష్ట్రంలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతుంటే డీజీపీ ఏం చేస్తున్నారు?
-మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప
మంత్రి కొడాలి నాని కనుసన్నల్లో గుడివాడలో జరుగుతున్న జూద క్రీడల్ని ప్రజలకు తెలియజేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకల దాడి దుర్మార్గం.ఎందరో మహనీయులు పుట్టిన గుడివాడను మంత్రి కొడాలి నాని తన అక్రమ సంపాదన కోసం భ్రష్ఠు పట్టిస్తున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా గుడివాడలో క్యాసినో పెట్టి తెలుగు వారి పరువు, ప్రతిష్ట మంట గలుపుతున్నారు.వైసీపీ నేతల అక్రమాల్ని, చీకటి వ్యాపారాల్ని బయట పెడితే భౌతిక దాడులు చేస్తారా?
రాష్ట్రంలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతుంటే డీజీపీ ఏం చేస్తున్నారు?గుడివాడలో జరిగిన క్యాసినో, జూద క్రీడల్ని అడ్డుకోలేని పోలీసులు టీడీపీ నేతల్ని అడ్డుకోవడం విడ్డురంగా ఉంది. వైసీపీ నేతలు సంఘ విద్రోహ శక్తుల్లా తయారయ్యారు.మంత్రి కొడాలి లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలి.గుడివాడలో క్యాసినో నిర్వహించిన కొడాలి నానిని అరెస్ట్ చేయాలి.