– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శ
అమరావతి: ఖాళీగా ఉండడంతో వైసీపీ నేతలకు మతిభ్రమించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు.
సీఎం అంటే కామన్ మ్యాన్ లా ఎలా ఉన్నారో? ప్రజల మధ్య మీరు కూడా అలాగే ఉండాలని కలెక్టర్లకు సూచించారు.
అమలాపురం లో వైసీపీ శెట్టిబలిజ నేతలు… ఖాళీగా ఉండి నాపై ఆరోపణలు చేస్తున్నారు… గతంలో శెట్టి బలిజి పేరు తీసేస్తారని లేనిపోని అపోహలు సృష్టించారు… శెట్టి బలిజలను ఓసి ల్లో కలిపేస్తారని గతంలో వైసిపి నేతలు మాట్లాడారు…. గత మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చేస్తున్నప్పుడు శెట్టి బలిజలకు సంబంధించి మెమో జారి చేశారు. కులాల చిచ్చుపెట్టాలని… అమలాపురంలో ఫోర్ మెన్ షో అని .. షో చూపిస్తూ ఉంటారు మున్సిపాలిటీలో ఉన్న వారిని పీడిస్తూ ఉంటారు….. అలాంటి వారి ఆరోపణలు చేస్తున్నారు..
బీసీ కులానికి ఆర్థిక విసులుబాటు గతంలో కల్పించలేదు… కూటమి వచ్చిన తర్వాత గీత ఉప కులాలకు ఆర్థికంగా చేయూత నిచ్చాం.. అమలాపురం సెటిల్మెంట్ వైసిపి బ్యాచ్ ఇవన్నీ జీర్ణించుకోలేక వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారడంపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు..
నాపై ఆరోపణలు చేస్తున్నవారు కూటమిలో చేరతానని చెప్పడంతో చేర్చుకోలేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంత స్థాయి ఉన్న వ్యక్తులు కూడా వీరి కాదు.. అమలాపురం టౌన్ అధ్యక్షుడు ఇంటి చుట్టూ నాలుగు పార్టీ జెండాలు ఎగురుతాయి…వీరు జలగలు మున్సిపాలిటీని బట్టి పీడిస్తూ ఉంటారు.. అమలాపురంలో స్థానిక పనులు, గత ప్రభుత్వం వైసీపీ చేసిన పనులపై విజిలెన్స్ కమిటీ వేశాను తప్ప స్థానిక ఎమ్మెల్యే మీద కాదు…. అది కూడా నేను గెలిచిన వెంటనే… గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని వివాదాస్పద పనులు పై విజిలెన్స్ కమిటీ వేశాను మా ఎమ్మెల్యే మీద నేనెందుకు వేస్తాను?
చెల్లిబోయిన వేణు బీసీ కులాల గురించి గానీ ఉప కులాల గురించి గానీ మాట్లాడే అర్హత లేదు…. శెట్టి బలిజ కులం పేరు చెప్పి గతంలో కొంతమంది కాళ్లు పట్టుకున్న వ్యక్తి వేణు. 23, 24 మధ్యలో ఒక జీవో తేలేని వ్యక్తి చెల్లుబోయిన వేణు…. ఒక మాట పట్టుకుని జీవో బదులు మేము డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కులాన్ని అపహస్యం చేస్తే ఈ అమలాపురం సెటిల్మెంట్ బ్యాచ్ కి నొప్పి ఉండదు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పై మాట్లాడినందుకే పౌరుషం వచ్చేస్తుంది వీరికి అని మంత్రి ఎద్దేవా చేశారు.