ట్విట్టర్ లో మాజీ మంత్రి, టిడిపి నేత అయ్యన్నపాత్రుడు
వైసీపీ మంత్రులు భజనకు తప్ప బాధ్యతకు పనికి రారు. ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో యాక్టర్ పేలి 6 గురు సజీవదహనం అయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పరిగెత్తుకుని ఘటనా స్థలానికి వెళ్లాల్సిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు మాత్రం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇలాంటి భజన బృందం కారణంగానే వందలాది మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.