(వాసు)
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించిన ఎమ్మెల్సీ భరత్.. ప్రభుత్వం మారగానే అడ్రస్ లేకుండా పోయారంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ పదవి అనుభవించిన భరత్.. ప్రస్తుతం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం..
చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భరత్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు వాల్ పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించిన ఎమ్మెల్సీ భరత్.. ప్రభుత్వం మారగానే అడ్రస్ లేకుండా పోయారంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లూ పదవి అనుభవించిన భరత్.. ప్రస్తుతం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు వరకు కుప్పం నియోజకవర్గంలో హల్చల్ చేసిన భరత్ ఎన్నికల తర్వాత నుంచి నియోజకవర్గంలో కనిపించడంలేదట.