Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు విషయంలో జగన్ పిచ్చిపని చేశాడని తెలివితక్కువగా వ్యవహరించాడని వైసీపీ వాళ్లే అంటున్నారు

• ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలా అని అధికారపార్టీ నేతలు భయపడుతున్నారు
• భువనేశ్వరి మాటలు చాలా గొప్పగా ఉన్నాయి
• హుందాతనం, పరిణితితో కూడిన ఆమె వ్యాఖ్యలపై ప్రతి మహిళా ఆలోచించాలి
– రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను యావత్ ప్రపంచం గమనిస్తోందని, చంద్రబాబు కు ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం తెలివితక్కువగా వ్యవహరించాయ ని టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

భువనేశ్వరి మాటలు, మనోధైర్యం, హుందాతనం సర్వదా ప్రశంసనీయం
“ చంద్రబాబునాయుడిని కలిసిన అనంతరం భువనేశ్వరి మాట్లాడింది విన్నాక, ఆమెను కలిసిన ప్రజలను చూశాక అసలైన హుందాతనం ఎలా ఉంటుందో చూశాం. ఏ నాయకుడి సతీమణి వ్యవహరించనంత గొప్పగా ఆమె మాట్లాడారు. చంద్ర బాబు గారు చాలా ధైర్యంగా.. హుందాగా ఉన్నారని, ఆయనకోసం ప్రజలు కూడా అదే విధంగా ఉండాలని ఆమె చెప్పడం ఆమెలోని పరిణితికి నిదర్శనం. ఆమెమాటలు విన్నాక మాకు కూడా చాలా శక్తి, మనోధైర్యం వచ్చింది. చంద్రబాబునాయుడి లాంటి నాయకుడు భోజనంచేయడానికి కనీసం చిన్నబల్ల కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం ఆయనపై ఎంత కక్షతో ఉందో అర్థమవుతోంది.

ముఖ్యమంత్రి చేసింది పిచ్చిపని అధికార పార్టీ వారే అంటున్నారు
చంద్రబాబుని అరెస్ట్ చేసి 17 రోజులైనా ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదు. అసెంబ్లీ నుంచి టీడీపీసభ్యుల్ని బయటకు పంపించిన అధికారపార్టీ సభ్యులు కుప్పిగంతులతో ముఖ్యమంత్రి భజన చేస్తున్నారు. ఎవరూ ధైర్యంగా జగన్ రెడ్డి చేసింది తప్పని చెప్పలే ని దుస్థితిలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి చేసిన పనిని సొంతపార్టీ వారే పిచ్చిచేష్టగా అభివర్ణిస్తున్నారు. జగన్ రెడ్డి చేసిందానికి మేం ప్రజలముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలే వాపోతున్నారు.

చంద్రబాబు మేథస్సు… ఆయన కీర్తి ప్రతిష్టలు.. ఆయన చేసిన అభివృద్ధి ఎప్పటికీ మరువలేం
పదిమంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదుగానీ, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే న్యాయశాస్త్ర వ్యాఖ్యను చంద్రబాబు విషయంలో మననం చేసుకోవాలి. పదిమంది తెలి వి తక్కువ వాళ్లను నిర్లక్ష్యం చేయవచ్చుగానీ, ఒక మేథావిని నిర్లక్ష్యం చేయకూడదనే నానుడి కూడా టీడీపీ అధినేతకు అతికినట్టు సరిపోతుంది. చంద్రబాబునాయుడి మేథ స్సు, ఆయన కీర్తి ప్రతిష్టలు, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరి చిపోలేం. హైటెక్ సిటీ నిర్మాణంతో ఆయన కీర్తి ఆకాశాన్నే అంటిందని చెప్పాలి.

హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్టే రాజధాని లేని రాష్ట్రాన్ని వృద్ధి లోకి తీసుకురావాల ని చంద్రబాబు సంకల్పించారు. ప్రజా రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టారు. పోలవ రం ప్రాజెక్ట్ ను 72శాతం పూర్తిచేశారు. అంతా సాఫీగా జరుగుతుందనుకుంటున్న సమ యంలో దురదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం రావడంతో రాష్ట్రం మొత్తం నాశనమైంది. ప్రజలంతా ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా… మా సమస్యలు పరిష్కరి స్తాడని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇంగితజ్ఞానం ఉన్నవారెవరూ మరలా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు
అసెంబ్లీలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నా రు. మరలా జగన్ రెడ్డి రావాలనడం వారి అజ్ఞానమే. అమ్మఒడిని అయ్యబుడ్డిగా మార్చాడు… నిత్యావసరాలు సహా అన్నిధరలు పెంచేశాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మరలా రావాలని ఇంగితజ్ఞానమున్న వారు ఎవరూ కోరుకోరు. చంద్రబాబుని అక్రమం గా అరెస్ట్ చేసి 17 రోజులైనా ఆయన తప్పు చేశాడని నిరూపించలేకపోయారు. అయి నా సిగ్గులేకుండా పవిత్రమైన అసెంబ్లీలో కారుకూతలు కూస్తున్నారు. ప్రజలంతా చంద్ర బాబుకు మద్ధతుగా రోడ్లెక్కుతుంటే పోలీసులతో వారిని అణచివేయాలని చూస్తున్నారు.

చంద్రబాబు దోషి అని నిరూపించలేక.. నిర్దోషిగా వదిలిపెట్టలేక ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి ఎన్నిచేసినా… చంద్రబాబుకి చిన్న అవినీతి మరక కూడా అంటించలేడు. లోకేశ్ పారిపోయాడంటున్న వారు.. సింహం త్వరలోనే జూలు విదిలించి బయటకు వస్తుందని తెలుసుకుంటే మంచిది. టీడీపీ యువనేత ధాటికి తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం యువగళం యాత్రను అడ్డుకోవడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసింది.

ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం చంద్రబాబుకి అండగా ఉందని తెలుసుకోండి. మహిళలంతా భువనేశ్వరి పిలుపునకు స్పందించి, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, చంద్రబాబుని విడుదలచేసేవరకు ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాడాలి.” అని రాజకుమారి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE