Home » బీజేపీలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు?

బీజేపీలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు?

– జగన్‌కు ఝలక్ ఇవ్వనున్న ఐదుగురు రాజ్యసభ ఎంపీలు?
– విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, కృష్ణయ్య, మోపిదేవి, అయోధ్య జంప్?
– బీజేపీతో మంతనాలు పూర్తి?
– బాబును వ్యతిరేకించే ఓ మాజీమంత్రి తనయుడైన యువ ఎంపీతో ఒక మీడియా అధిపతి మంతనాలు?
– ఆ మీడియా అధిపతి ఎంపీ లిక్కర్-శాండ్ వ్యాపారాలు స్వాధీనం చేసుకుంటున్నారా?
– చిత్తూరు జిల్లాలో బాబుపై హత్యాయత్నం కేసు పెట్టించిన ఆ మాజీ మంత్రి
– కుప్పంలో బాబుకు సమస్యలు సృష్టించి జగన్‌ను మెప్పించిన వైనం
– ఇప్పుడు ఆయన వ్యాపారాలకు మీడియా అధిపతి దన్నుగా నిలిచారన్న చర్చ
– ఐదేళ్ల పాటు ఆ ఎంపీ వ్యాపారాలు మీడియా అధిపతి చేసుకునే ఒప్పందం?
-టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ అధినేత జగన్‌కు సొంతపార్టీకి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? బీజేపీతో ఆ మేరకు మాటాముచ్చట పూర్తయిందా? జగన్ మేలుకోరే విజయసాయి సహా.. మొత్తం ఐదుగురు రాజ్యసభ సభ్యులు గంపగుత్తగా కమలవనంలో సేదతీరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? అటు చిత్తూరు జిల్లాను శాసించి, ఐదేళ్లు చంద్రబాబును రాజకీయంగా-మానసికంగా ఇబ్బందిపెట్టిన ఒక మాజీ మంత్రి, తన వ్యాపారరక్షణ కోసం ఒక పత్రిక-చానెల్ అధిపతితో సెటిల్‌మెంట్ చేసుకున్నారా? ఇసుక-మద్యం వ్యాపారాలను సదరు మీడియా అధిపతికి అప్పగించేందుకు ఒప్పందం చే సుకున్నారా?.. ఇదీ ఇప్పుడు బీజేపీ-టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్.

వైసీపీ అధినేత జగన్‌కు మరికొద్దిరోజుల్లో భారీ షాక్ తగలనుందట. ఐదుగురు రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాంరాం చెప్పి, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వార్తలు గుప్పుమంటున్నాయి. వీరికి జగన్ మేలు కోరే విజయసాయిరెడ్డి సారధ్యం వహిస్తున్నారన్న విభ్రాంతికర వార్తలు మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఆయనతోపాటు మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, అయోధ్య రామిరెడ్డి కలసి గంపగుత్తగా కాషాయం కప్పేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న చర్చ బీజేపీ వర్గాల్లో గత కొద్దిరోజుల నుంచి వినిపిస్తోంది. వీరిలో అయోధ్య రామిరెడ్డి-బీద మస్తాన్‌రావు పారిశ్రామికవేత్తలన్న విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి-అయోధ్యరామిరెడ్డి ఇద్దరూ వైసీపీ ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా పనిచేశారు. రాజ్యసభలోబలం లేని బీజేపీ, వీరి రాకతో బలపడుతుంది.

ఇదిలాఉండగా.. వైసీపీ లోక్‌సభ యువ ఎంపి కూడా, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్‌ఫ్రా కంపెనీలతోపాటు.. ఏపీలో జే బ్రాండ్లు-ఇసుక-మైనింగ్ వ్యాపారం చేసే ఆయనకు, బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఆయన రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, చాలా లౌక్యంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఐదేళ్ల పాటు లిక్కర్ తయారుచేసేందుకు డిస్టలరీస్‌ను స్వాధీనం చేసుకుని, జే బ్రాండ్లు తయారుచేసిన ఆయన.. అధికారంలో ఉన్నంతవర కూ ఇసుక వ్యాపారాల్లోనూ కీలకపాత్ర పోషించిన విషయం బహిరంగమే.

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న సదరు యువ ఎంపీతో, ఒక మీడియా అధినేత మంతనాలు సాగించినట్లు టీడీపీ-వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమేరకు జరిగిన ఒప్పందంలో భాగంగా.. సదరు ఎంపి నిర్వహిస్తున్న లిక్కర్-ఇసుక వ్యాపారాలన్నీ ఆ మీడియా అధిపతి ఏలుబడిలోకి వెళ్లేందుకు ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారిందట.

నిజానికి సదరు మాజీ మంత్రి.. ఐదేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును చిత్తూరు జిల్లాలో రాజకీయంగా నిర్వ్యీర్యం చేసే ప్రయత్నాలు చేశారు.తనకు నచ్చిన ఎస్పీ, కలెక్టరు, డీఎస్పీలను నియమించుకుని, టీడీపీ కార్యకర్తలను వేధించారని, స్వయంగా టీడీపీ నేతలే ఆరోపణలు గుప్పించారు. చివరకు బాబు సొంత కుప్పం నియోజకవర్గంలో సైతం , ఆయనను ఓడించేందుకు జగన్‌తో కలసి ప్రత్యేక వ్యూహం అమలు చేశారు. అంగళ్లుకు వెళ్లిన బాబుపై, హత్యాయత్నం కేసుకూడా పెట్టించిన వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. బాబును జైలుకు పంపించడంలో ఆయనే కీలకపాత్ర పోషించారంటున్నారు.

చంద్రబాబు పట్ల అంత నిర్దయ-క్రూరంగా వ్యవహరించిన ఆ మాజీ మంత్రి కుటుంబంతో, సదరు మీడియా అధిపతి చర్చించడంపైనే టీడీపీ-వైసీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘వ్యాపారాల కోసం పార్టీని బలిచేస్తారా? చంద్రబాబుకు గతంలో చేసిన ఆ మంత్రి చేసిన అవమానాలు మర్చిపోయారా? ఇలాగైతే పార్టీ శ్రేణులకు ఏం సంకేతం వెళుతుంది? పైస్థాయిలో ఇలా కుమ్మక్కు సర్దుబాటు రాజకీయాలు చేస్తే, మరి పార్టీ జండా మోసిన వారిన సంగతేమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సదరు మీడియా అధిపతి.. నెల్లూరుకు చెందిన ఒకరికి, విశాఖ జిల్లాకు చెందిన మరొకరికి మంత్రి పదవులిప్పంచడంలో, కీలకపాత్ర పోషించారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. విశాఖ జిల్లా వ్యవహారంపై అయితే, పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతుండటం ప్రస్తావనార్హం.

సదరు మీడియా అధిపతి వ్యాపారబంధంలో, ఒక బీజేపీ ఎంపీ దన్ను కూడా ఉందన్నది పార్టీ వర్గాల కథనం. నిజానికి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు పర్యవేక్షించే అంజిరెడ్డి అనే వ్యాపారితో, సదరు బీజేపీ ఎంపీ ఇటీవల ముచ్చటించి ఇసుక తవ్వకాల వ్యాపారం తనకు అప్పగించాలని కోరినట్లు తెలుస్తోంది. సదరు అంజిరెడ్డి దీనికి సంబంధించి.. తనకు పైనుంచి వచ్చిన ఆదేశాలనే పాటి స్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.

Leave a Reply