Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది

-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 
వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే జగన్ రెడ్డి గారికి జనంకంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోంది. వైసీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారు, 12 గ్రామాలు నీట మునిగాయి, రూ.1721 కోట్ల నష్టం వాటిల్లింది. బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం, ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారు. జల ప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చెయ్యాల్సిన ప్రభుత్వమే వారికి అండ నిలవడం బాధాకరం.
Whats-App-Image-2021-12-06-at-18-18-14

LEAVE A RESPONSE