– టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
– వైసీపీలో తగ్గని జోష్..
గుంటూరు జిల్లాలో వైసిపి మరోసారి తన సత్తా చాటుకుంది స్థానిక బై పోల్ లో ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన పల్నాడులో వైసీపీ జెండా రెపరెపలాడింది ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి.
పల్నాడులో తొలిసారి జరిగిన దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డులకు గాను వైసీపీ 11 తెలుసుకొని చైర్మన్ పదవి కైవసం చేసుకుంది టీడీపీకి 7, జనసేనకు 1, మరో ఇండిపెండెంట్ గెలిచారు.
ఇక గురజాలలో వైసీపీ ప్రభంజనం వీచింది. 20 వార్డులకు గాను 16 వైసిపి దక్కించుకోగా టి డి పి 3, జనసేన 1 గెలుపొందాయి. ఏది ఏమైనా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ ఎన్నికల్లో చేసిన కృషి ఈ ఫలితాలను చెప్పవచ్చు. ఎన్నికలు మొదలైనప్పటి నుండి పోలింగ్ పూర్తయ్యే వరకు అధికార వైసీపీ
ప్రతిపక్ష టీడీపీని ఎదుర్కొనడంలో సఫలీకృతమైంది. టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు అధికారంలో ఉన్నప్పుడు, చేసిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవడం లో మహేష్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈ నగర ఎన్నికలలో ప్రజలు పట్టం కట్టారని తిరిగి వైసీపీ ని గెలిపించారు అని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.రెండున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన కు ఈ ఫలితాలే నిదర్శనమని కొనియాడారు. ఇలా పల్నాడులో మరోసారి వైసీపీ తన పట్టు నిలుపుకుంది.
అయితే తెలుగుదేశం పార్టీ కేడర్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఓడిపోయినప్పటికీ అధికార పార్టీని తట్టుకొని గట్టి పోటీ ఇవ్వగలిగామని అంటున్నారు. టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు దగ్గరుండి, అభ్యర్థుల ఎంపిక నుండి పోలింగ్ కౌంటింగ్ వరకు నిరంతరం పని చేశారు. అభ్యర్థులు అధికారపార్టీకి తగ్గకుండా పోటీలో నిలపగలిగారు. అధికార పార్టీ బెదిరింపులు ఉన్నప్పటికీ ప్రజలు వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పై ఉన్న అసంతృప్తి టీడీపీకి ఓట్లు తెచ్చి పెట్టాయని ఇంక వైసీపీ పతనం ఖాయం అని యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇవ్వని తెలుగుదేశం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని పరిస్థితి నుండి బై పోల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం టిడిపి కేడర్లో నూతన ఉత్సాహాన్నిచ్చింది. అదేవిధంగా జనసేన గురజాలలో 1, దాచేపల్లిలో 1 వార్డును కైవసం చేసుకొని తన పట్టు నిలుపుకుంది.
గుంటూరు కార్పొరేషన్ వార్డు బై పోల్లో టిడిపి విజయం
గుంటూరు కార్పొరేషన్లో 6వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పోతురాజు సమత 537 భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీప వైసీపీ అభ్యర్థి ఆతుకూరు నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. వైసీపీలో ఉన్న అసమ్మతి సమతా విజయానికి దోహదపడిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల అవినీతి పాలన కార్పొరేషన్లో సమస్యలు తిష్ట వేయడంతో ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించారని గెలుపొందిన టిడిపి అభ్యర్థి సమత తెలిపారు.