– యూరియా కొరత లేకున్నా రైతుల్లో వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోంది
– యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు అందజేస్తున్నాం
– వ్యవసాయాన్ని నాశనం చేసిన జగన్ నేడు అన్నదాత పోరుతో కొత్త డ్రామా
– దమ్ముంటే వ్యవసాయం, ఇరిగేషన్ అంశాలపై చర్చకు వైసీపీ సిద్ధమా?
– కూటమికి మంచి పేరు వస్తుందనే ప్రతి విషయంలో వైసీపీ విష ప్రచారం
– మామిడి, పొగాకు, కోకో, ఉల్లికి మద్దతు ధర కల్పించాం
– గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
మంగళగిరి: కూటమి ప్రభుత్వం విజయవంతగా పాలన సాగిస్తూ… ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేసిందని గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలలో ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశాం. రేపు 10న అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయం ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సంక్షేమాలు అమలు చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని, వైసీపీ ఫేక్ ప్రచారానికి తెర లేపిందన్నారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే…
ప్రజల్లో ఆందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం జగన్ రెడ్డి దిగజారుడు తననానికి నిదర్శనం. సమస్యలు ఉంటే పప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. కానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా తప్పుడు పత్రికతో తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తూ దిగజారిపోతున్నారు. ప్రతి ఏటా రైతులకు యూరియా అందజేడయం, సాగునీటి సరఫరా, వంటివి చేయడం ప్రభుత్వ పని.
గత ఐదేళ్ల పాలనలో ఒక్క కాలువ పనులైనా చేశారా? ఒక్క ప్రాజెక్ట్ ను అయినా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించారా? ఇవేం చేయకుండా రైతులను నట్టేట ముంచి నేడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. హంద్రీనీవా తో కూటమి ప్రభుత్వ పాలనలో ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది. ఒక్క రూపాయి కూడా హంద్రీనీవా కోసం జగన్ ఖర్చు చేయలేదు. రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా ద్వారా మేలు జరిగిన విషయం వాస్తవం.
యూరియా కొరత అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం
జగన్ తన హయాంలో అయిదు లక్షల టన్నుల యూరియా మాత్రమే తీసుకొచ్చారు. మేం ఏడు లక్షల యూరియా అందుబాటులో ఉంచాం. లేనిది ఉన్నట్టు చూపించి రైతుల్లో భయాందోళనలు సృష్టించి క్రృతిమ కొరత తెస్తున్నారు. 2025 ఆగస్టుకే 5,69,712 టన్నులు రైతులకు సరఫరా చేసేశాం. ప్రస్తుతం 94,482 వేల టన్నులు సరఫరా చేశాం. ఈ నెలలో 10 లోపు మరో 40 వేల మెట్రిక్ టన్నులతో కలిపి 7 లక్షల టన్నులు యూరియా సరఫరా చేస్తున్నాం. వైసీపీ విధానమే ఫేక్ ప్రచారం చేయడం. రైతుల పట్ల అత్యంత బాధ్యతగా ప్రభుత్వం పనిచేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి సర్వనాశనం చేస్తే… ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేమని వైసీపీ నాయకులే చెబితే… 2027 కి పోలవరం పూర్తి చేసేలా చంద్రబాబు పని చేస్తున్నారు.
ధాన్యం ప్రతి గింజా మేమే కొంటామని చెప్పిన జగన్ రెడ్డి… అరకొరగా కొనుగోలు చేసి, ధాన్యం సొమ్మును మూడు నెలల తర్వాత కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. జగన్ రెడ్డి రైతుల ధాన్యం సొమ్ము రూ.1,624 కోట్లు ఎగొట్టింది. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా రూ.1624 కోట్లు ఒక్క నెలలో మొత్తం రైతులకు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానిది. 42 లక్షల టన్నుల ధాన్యం మీరు కొంటే… 68 లక్షల టన్నుల ధాన్యం కొని 24 గంటల్లో డబ్బులను రైతులకు చెల్లించాం.
నీటిపారుదల రంగానికి మేం రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తే… మీరు కేవలం రూ.30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. డ్రైయిన్లు, ఇతర నీటి ప్రాజెక్టులకు ఎందుకు ఖర్చు చేయలేకపోయారు. 2024 -29 సాగునీటి రంగానికి లక్ష నుంచి లక్షన్నర కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పులివెందులలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు నింపితే మొత్తం పులివెందులల్లో రైతులు బాగుపడతారు. అది జరగాలంటే హంద్రీనీవా ద్వారా నీరు రావాలి. అది చేసేందుకు కూడా జగన్ రెడ్డి మనసు రాలేదు. రైతు సమస్యలపై జగన్ రెడ్డి సమీక్ష చేసిన రోజు ఒక్కటి లేదు. కానీ ఈ రోజు వ్యవసాయం, సాగునీటి రంగాలపై సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తూ రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీనే. దాదాపు 1500 టన్నులు బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారు. రైతులు యూరియాపై భయపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే రైతు సమస్యలపై చర్చకు వైసీపీ రావాలి. మీరు ఎంత యూరియా రైతులకు ఇచ్చారు, వ్యవసాయం, ఇరిగేషన్ కోసం మీరు ఏం చేశారో చర్చించేందుకు వైసీపీ నాయకులు సిద్ధా? మేం సిద్ధంగా ఉన్నాం