యువగళానికి జనం నుంచి వస్తున్న స్పందన చూసి జగన్మోహన్ రెడ్డికి లండన్ మందులు పనిచేయడం లేదు. జగన్ ఎంత పిరికివాడో తెలుసా. నా పాదయాత్రను ఆపడానికి వెయ్యి మంది పోలీసులు, 20 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, 6 గురు డీఎస్పీలను పంపాడు. పోలీసు సోదరులకు చెప్పా..నా పేరు లోకేష్..నక్సలైట్ కాదు. నా ముందు 30 జీపులు, డ్రోన్ కెమెరాలు, ఇంటెలిజన్స్ ఉన్నారు. కొందరు పోలీసులు వచ్చి ఒక డ్రోన్ ఎగురేస్తారు. ఈ వీడియోలు అమరావతిలో కూర్చున్న రఘురామిరెడ్డి, జగన్ రెడ్డి చూస్తారు. నా సౌండ్ వెహికల్ ఆపారు… నా స్టూల్ లాక్కున్నావు..తగ్గేదేలేదు. 3.8 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న జగన్ రెడ్డి ఏమి పీకాడు..నా మైకు పీకాడు. అయ్యా జగన్ రెడ్డి..మీరు పది ఫెయిల్. మీకే ఇంత తెలివి ఉంటే స్టాన్ ఫోర్డ్ లో చదివిన నాకు ఎంత తెలివి వుందో తెలుసుకో. జగన్ నా మైక్ లాక్కున్నాడు..నా గొంతుకాదు. నిజం, న్యాయం కోసం పోరాడే గొంతు నాది..ఈ గొంతు ఆగదు. ప్రజల కోసం పోరాడేందకు బయలుదేరితే 20 కేసులు పెట్టాడు. జగన్ కు ఆఫర్ ఇస్తున్నా..400 కేసులు పెట్టుకో. నా మైకు లాక్కోవడం న్యాయమేనా.? రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి, షర్మిళ పాదయాత్ర చేసినప్పుడు వారి మైకు చంద్రబాబు లాక్కున్నారా? లక్ష కోట్లు దోచుకుని జైలుకెళ్లిన జగన్ చంద్రబాబును తిడితే నో రూల్స్.
నేను యువత తరపున పోరాడుతుంటే ఎ1 జీవో-1 తెచ్చారు. ఎన్ని జీవోలు తెచ్చినా ఈ లోకేష్ తగ్గడు..ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో ఈ లోకేష్ లొంగడు. జగన్ రెడ్డిది రాజారెడ్డి రాజ్యాంగం..నాది అంబేద్కర్ రాజ్యాంగం. నాపై డ్రోన్ ఎగురవేసి ఏం పీకుతావు రఘురామిరెడ్డి? నాపై పెట్టే దృష్టి పోలీసుల ఇబ్బందులుపై దృష్టి పెట్టండి. వారికి 3 సరెండర్ లీవ్స్ పెండింగులో ఉన్నాయి. ఒక్కో కానిస్టేబుల్ కు రూ.75 వేలు రావాలి. ఎస్.ఐలకు 90 వేల రావాలి. సీఐలకు లక్ష రావాలి. టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులు 8 నెలలుగా పెండింగులో ఉన్నాయి. మీరన్నా మాట్లాడి మా సమస్యలపై పోరాడండని పోలీసులు చెప్తున్నారు. హోంగార్డులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రఘురామిరెడ్డి ఈ సమస్యలు పరష్కరించాలి. ఎన్టీఆర్ దేవుడు..చంద్రబాబు రాముడు..ఈ లోకేష్ వైసీపీకి మూర్ఖుడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు యువతకు 40 వేల పరిశ్రమలు తెచ్చి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. రాక్షసుడు జగన్ వచ్చి 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు..ఆ హామీ ఏమైంది.? ఏటా ఇస్తానన్న జాబ్ కేలండర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హామీ గోవిందయ్యాయి. ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ అన్నాడు..అవి కూడా గోవింద. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయన్నాడు..25 మంది ఎంపీలివ్వండి మోడీ మెడలు వంచుతానన్నాడు. రాజ్యసభ ఎంపీలతో కలిపి 31 మంది ఎంపీలు ఉన్నారు..ఏం పీకుతున్నారు.? వీళ్లు ఏనాడైనా పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై మాట్లాడారా.? మోడీని చూస్తే జగన్ రెడ్డి గడగడలాడిపోతున్నారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉన్నాయి. సొంత బాబాయిని చంపారు. భారతీరెడ్డి, జగన్ రెడ్డి పీఏలను సీబీఐ విచారణకు పిలుస్తోంది. మోడీని చూస్తే జగన్ రెడ్డికి కేసులు తప్ప హోదా గుర్తు రావడం లేదు. ప్రత్యేక హోదా పేరుతో యువతను నిలువునా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. పేదలకు వరమైన విదేశీ విద్య కట్ చేశాడు. 77 జీవో తెచ్చి ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు రూ.20 వేల కోట్లు పసుపు కుంకుమ ద్వారా అందించారు. జగన్ వచ్చాక పెంచుకుంటూ పోతా అన్నాడు.. గ్యాస్, నూనె, పంచదారు, ఉప్పు, ఇంటి పన్ను పెంచుకుంటూ పోతున్నాడు. అమ్మఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానన్నాడు. కానీ ఒకరికే ఇస్తున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు..చేశాడా? ఆంధ్రాగోల్డ్, బూమ్ బూమ్ తీసుకొచ్చాడు. ఈ మందు తాగి ఆసుపత్రుల పాలవుతున్నారు. కల్తీ మద్యం కొడితే పొలాల్లోలోని పురుగులు చనిపోతున్నాయి. మహిళల మంగళ సూత్రం తాకట్టు పెట్టి… మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. చాలీచాలని పెన్షన్ రూ.2 వందలుంటే చంద్రబాబు రూ.2 వేలు చేశారు. ఈ కంత్రీ సీఎం రూ.3వేల ఇస్తానన్నాడు. ఇచ్చాడా? పెన్షన్ దారులు జగన్ మోసంతో పేదలు రూ.30 వేల కోల్పోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. గిట్టుబాటు ధర అందించారు. రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ తెచ్చారు. పాడి రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ ఇచ్చారు. మామిడికి గిట్టుబాద కల్పించారు. కానీ ఈ జగన్ రెడ్డి ఏం చేశారు.? రైతు భరోసాతో ఐదేళ్లకు రూ.30 వేలు మాత్రమే ఇస్తున్నాడు. మామిడి, చెరకు రైతులకు గిట్టుబాటు ధర లేదు. పాడి రైతులకు ఇస్తానన్న రూ.4 బోనస్ మర్చిపోయాడు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3 స్థానంలో ఉంది. మోటార్లకు మీటర్లు పెడతాం అంటున్నారు. రైతు రాజ్యం అని రైతులేని రాజ్యం తెచ్చారు. రైతులకు మోటార్లు బిగిస్తే వారికి ఇక ఉరితాడే. ఉద్యోగులక చంద్రబాబు ఉన్నప్పుడ పండగలా ఉంది. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ జగన్ వచ్చి ఉన్న ఫిట్మెంట్ పీకేశాడు. నెలనెలా జీతం పడటంలేదు. జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి. రాయలసీమకు ఈ సీఎం అన్యాయం చేస్తున్నాడు. ఒక్కసాగు నీటి ప్రాజెక్టైనా పూర్తి చేశాడా.? ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా.? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.? చిత్తూరులో పెద్దపరిశ్రమ అమర్ రాజాను తెలంగాణ తరిమేశాడు. దీంతో 10 వేల ఉద్యోగాలు పోయాయి.
అంబానీతో మాట్లాడి తిరుపతికి తీసుకొచ్చిన రిలయన్స్ తెలుంగాణకు తరిమాడు. దీంతో మరో 50 వేల ఉద్యోగాలు పోయియి. అన్నమ్మయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది చనిపోయారు. వాళ్లకు ఇప్పటికీ న్యాయం చేయలేదు. హంద్రీనీవాకు రూ.100 కోట్లు ఖర్చ చేస్తే పూర్తవుతుంది..దాన్ని కూడా వదిలేశాడు. జగన్ సీఎం అయ్యాక..అన్నా క్యాంటీన్ పీకాడు…చంద్రన్నబీమా, చంద్రన్న కానుకలు పీకాడు. బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు పీకేశాడు. అప్పులు, గంజాయి, మైన్, వైన్ లో రాష్ట్రాన్ని జగన్ మొదటి స్థానంలో నిలిపాడు. సొంత బాబాయిని చంపినోన్ని ఏమనాలి..సైకోనే అనాలి. తల్లి, చెల్లిని బయటకు తరిమినోడ్ని సైకోనే అంటారు. ఆయన సైకో అవ్వడంతో పాటు జిల్లాకొక సైకోను తయారు చేశాడు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అనే సైకో ఉన్నాడు. ఎర్రచందనం, మైనింగ్, జిల్లాలో జరిగే అన్ని అవినీతి కార్యక్రమాల్లో ఈ చిత్తూరు సైకో పెద్దిరెడ్డి ఉంటాడు. ఈ చిత్తూరు సైకో పెద్దిరెడ్డికి పోటీగా నగరిలో డైమండ్ పాప తయారైంది. జబర్థస్త్ ఆంటీ అని రోజా కోరిక మేరకు పిలుస్తున్నా. ఈ జబర్థస్థ్ ఆంటీ నాకు చీర గాజులు ఇస్తానంది. చీర గాజులు వేసుకున్నవాళ్లు చేతకాని వాళ్లా.? నువ్విచ్చే చీర, గాజులు తీసుకురా.. మా అక్క, చెళ్లెల్లకు ఇచ్చి కాళ్లు మొక్కుతా. రోజా నగరికి రానప్పుడు రోజా పరిస్థితి ఏంటి.? అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఎలా మారింది. ఇప్పుడు బెంజ్ కారు..ఊరూరా ఒక విల్లా. చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి. ఈమె బీచ్ లో నడిస్తే చెప్పులు మోయడానికి మరో ఉద్యోగి. కానీ నగరి ప్రజలకు మిగిలింది మాత్రం గంజినీళ్లు..కన్నీళ్లే.
విజయపురం మండలం, శ్రీహరిపురం, కోశలనగరం, పాతార్కాడు గ్రామంలో రోజా డ్రైరెక్షన్ లో గ్రావెల్ తవ్వి పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఒక్క పాతార్కాడు నుండి రోజుకు 50 టిప్పర్లు తోలుతున్నారు.
• వడమాలపేట మండలం కాయం రెవెన్యూలో పేదలకు పట్టాలు ఇచ్చే ప్రాంతంలోనూ గుట్టను చదును చేసి అక్కడున్న మట్టిని అమ్ముకున్నారు. పాదిరేడులో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సుమారు 400 ఎకరాలు సేకరించారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.19 లక్షల నుండి రూ.20 లక్షల పరిహారం అందిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుండి రూ.2.50 లక్షల వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 40 మంది రైతుల నుండి కోటి రూపాయలు ఈ మంత్రి వసూలు చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గ్రానైట్, గ్రావెల్ క్వారీ యజమానులు 40 శాతం వాటా ఇవ్వాలని బెదిరించడంతో వారు కూడా పరారయ్యారు. నగరి నియోజవర్గంలోని ఐదు మండలాలను విభజించి సొంత కుటుంబ సభ్యులకు అప్పగించింది. వడమాలపేట, నిండ్ర, పుత్తూరును అన్న రాంప్రసాద్ రెడ్డికి, విజయపురం మండలాన్ని కుమారస్వామిరెడ్డికి, నగరి మండలాన్ని భర్త సెల్వమణి తమ్ముడికి పంచేశారు. రోజా భర్తతో కలసి నగరికి ఐదురుగురు షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు. ల్యాండ్ కబ్జాలు జబర్దస్త్ గా చేస్తున్నారు. కోసలనగరం వద్ద 30 ఎకరాలు, వడలమాటపేట టోల్ గేటు వద్ద 55 ఎకరాలు, వైజాగ్ రిషికొండ వద్ద ఎకరా కబ్జా చేశారు. ఇసుక, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పక్కరాష్ట్రాలకు పంపుతున్నారు. రోజాకు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ వెళ్లడంపై ఉన్న ఇష్టం..ఇక్కడి మరమగ్గాల వారిపై లేదు. ఇక్కడ చేనేతలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు.? అధికారంలోకి వస్తే 300 యూనియట్లు ఉచిత కరెంట్ ఇస్తాం అన్నారు..ఏమైంది.? నేతన్న నేస్తం కింద ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయి.? ఇదే నగరిలో జగన్ రెడ్డి గాలేరి – నగరి ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని, టెక్ టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మామిడి, చెరకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని అన్నారు. ఇది మాట తప్పడం కాదా.? టీడీపీ అధికారంలోకి వచ్చాక గాలేరి-నగరిని పూర్తి చేస్తాం. నిరుద్యోగులకు మన నగరిలోనే ఇండస్ట్రియిల్ పార్కు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం.
బాబు అంటే బ్రాండ్..జగన్ అంటే జైలు. చంద్రబాబును చూస్తే పరిశ్రమలు వరుస కడతాయి. నగరికి పరిశ్రమలు తెచ్చే బాద్యత టీడీపీ తీసుకుంటుంది. చేనేత కార్మికులకు పక్క రాష్ట్రంతో ధీటుగా 500 యూనిట్ల ఉచిత విద్యుత్. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే. అగ్నికలు క్షత్రియులకు కుల సర్టిఫికేట్లు ఇబ్బంది లేకుండా ఇప్పిస్తాం. కంత్రీ జగన్ అందరికీ ఫోన్లు చేస్తున్నాడు. లక్షకోట్లు దోచిన జగన్ దగ్గర ఏమీ లేకపోవడం ఏంటి.? భారతీ సిమెంట్, సాక్షి టీవీ, పత్రిక, ప్యాలెస్ లు ఎవరివి.? నాకేమీ లేవంటాడు. భయపడి అందరికీ ఫోన్లు చేస్తూ..నాకెవరూ లేరు అంటున్నాడు. ప్రజలు ఒంటరివాళ్లు అయ్యారు. జగన్ సీఎం అయ్యాక ప్రజలు పేదవాళ్లు అయ్యారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం వెనకబడింది. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నవాళ్లే బాగుపడ్డారు. 2019లో రాష్ట్రం ఓడిపోయింది. అందరూ కలసి వచ్చి టీడీపీని గెలిపించుకోవాలి. సైకో పోతోనే మన యువతీ యువకులకు పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయి. నగరి నియోజవర్గంలో రెండు సార్లు టీడీపీ గెలవలేదు. మళ్లీ మనం ఇక్కడ గెలవాలి. కష్టపడి పనిచేయాలి. ఉత్సాహ వంతుడు గాలి భానుప్రకాష్ ఉన్నాడు. దీవించి..మంచి మెజార్టీతో గెలిపించండి. నగరిలో అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.