Suryaa.co.in

Andhra Pradesh

ప్రధాని చంద్రబాబును గౌరవిస్తే జగన్ కి ఉలికిపాటు ఎందుకు?

-రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, అందుకే క్రిందిస్థాయి కార్యకర్తలతో ముఖాముఖి
-ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలుచొక్కా పట్టుకొని నిలదీస్తున్న వీడియోలో నేషనల్ ఛానల్స్ లో వచ్చినా సిగ్గులేదు
– మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…
చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు బురదజల్లడం మాని రాష్ట్రానికి మీరేం చేశారో చెప్పాలని సజ్జలకు సవాల్ విసురుతున్నాను. మూడు సంవత్సరాల్లో సీఎం రాష్ట్రానికి ఏం తెచ్చారు? ఇన్నాళ్లు కేంద్రం నుండి ఏమీ సాధించలేకపోయారు. సీబీఐ, ఈడీ, అత్తున్నత వ్యవస్థలను లంచాలు, సంచులు ఇచ్చి మేనేజ్ చేస్తూవస్తున్నారు. అధికారం లేకపోయినా చంద్రబాబు దేశం గుర్వించదగ్గ మేధావి అని గుర్తించి ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమానికి పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయన సూచనలు, సలహాలు తీసుకుంది. పొత్తుల విషయం ఏదైనా ఉంటే మా నాయకుడు చంద్రబాబునాయుడు బహిరంగపరుస్తారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయింది. వైసీపీ ఎమ్మెల్యేలను చొక్కా పట్టుకొని నిలదీస్తున్నారు. మహిళలు ఎమ్మెల్యేలు, మంత్రులను బూతులు తిడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం వారి నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడటమేమిటి? 50 మంది చొప్పున నియోజకవర్గాల నుంచి కార్యకర్తలకు ట్రైన్ టికెట్లు ఇచ్చి పిలిపించి, వారికి బిర్యానీలు పెట్టి సజ్జలతో మాట్లాడిస్తున్నారు. మంత్రులు జగన్ ని కలవాలని వెళితే వెనక్కి పంపారు. బొత్స లాంటివారు జగన్ ను కలవాలని వచ్చి కారు దిగగానే అపాయింట్ మెంట్ లేదు పొమ్మన్నారు. కార్యకర్తలతో అనేక గంటలు గడుపుతున్నాడు. ఈ మూడు సంవత్సరాల్లో జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారో ప్రజలకు తెలపాలి. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయారు. వైసీపీ పని అయిపోయింది.

రాష్ట్రంలో వైసీపీ గురివింజ గింజ సామెతలా వ్యవహరిస్తోంది. చంద్రబాబు 45సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగి, ఒక క్రెడిబులిటి కలిగిన నాయకుడు. ఒక విజనరీ కలిగిన వ్యక్తి. చంద్రబాబు గొప్పతనం అందరికీ తెలుసు. దేశంలోని అనేక రాజకీయ పార్టీల పెద్దలు, మేధావులకు సైతం తెలిసిన వ్యక్తి చంద్రబాబు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని మేధావులని, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారితో ఓ కార్యక్రమం నిర్వహించింది. దానికి చంద్రబాబును పిలిచారు. రాబోయే 25 సంవత్సరాలలో ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు ఎలా అందించాలి, దేశానికి ఏ విధంగా ముందుకి తీసుకెళ్లాలని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ప్రధాని నిర్వహించిన కార్యక్రమానికి దేశానికి ఉన్నతమైన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన నాయకుడిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో నరేంద్రమోడి చంద్రబాబు నాయుడుతో అనేక విషయాలు మాట్లాడారు. గతంలో వీరువురు కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిస్తే వైసీపీకి ఉలికిపాటు ఎందుకు?

జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తన సొంత కేసులు మాఫీ కోసం వెళతారు. సిబిఐ, ఈడీ వంటి ఉన్నత వ్యవస్థలను మానెజ్ చేయడానికే వెళ్తారు. 22 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ రాష్ట్రానికి మేలు జరిగి విధంగా వ్యవహరించలేదు. ఒక్క ప్రాజెక్టు మంజూరు కాలేదు. ఒక్క ఫైలుని క్లియర్ చేసుకొని వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ సింహాంలా కేంద్ర మెడలు వంచుతానని చెప్పి ఢిల్లీ వెళ్లాకా మెడలు వంచి అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ ముఖ్య సలహాదారుడైన సకల శాఖా మంత్రిగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి అవాకులు, చవాకులు పేలుస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద నిర్మించిన పార్టీ వైఎస్సార్ పార్టీ. ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి 2019లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో ప్రజలకు ఏమీ చేయకపోగా లక్షల కోట్లు లూటీ చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో ఓటుకు నోటుకు కేసులో చంద్రబాబు నాయుడి మీద కేసు పెట్టడంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశారని వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు నాయుడును ఓటుకు నోటు కేసులో ఇరికించాలని అనేక ప్రయత్నాలు చేశారు. హైకోర్టుతో చీవాట్లు తిన్నారు. మంగళగిరి వైసీపీ ఎమ్మేల్యే ఆర్కే లండన్ వరకు వెళ్లి ఫోరెన్సీక్ ల్యాబ్ లో వాయిస్ టెస్ట్ లు చేయించి సుప్రీం కోర్టు వరకు వెళ్లి అన్ని ప్రయత్నాలు చేసి అందరి కాళ్ళు పట్టుకున్నా ఆ కేసుకు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని తేలింది.

ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీట్ లో అనేక మంది పేర్లతోపాటు చంద్రబాబు పేరుచేర్చాలని చూశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇరికించాలని ప్రయత్నాలు చేశారు. హైకోర్టు, సిబిఐ కోర్టు చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు లేదని తెలిపింది. సిసి నెం.912/2016లో చంద్రబాబు పేరు లేదు. జగన్ 13 కేసుల్లో ముద్దాయిగా ఉండి 18 నెలలు జైల్లో గడపిన వ్యక్తి. జగన్ రెడ్డి పక్క దేశం వెళ్లాలన్నా, పక్క దేశంలో ఉన్న తన కూతురి దగ్గరికి వెళ్ళాలన్నా తెలంగాణలో ఉన్న సిబిఐ కోర్టు అనుమతిస్తేనే దేశం దాటి వెళ్ళగలరు. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లేగలిగే పరిస్థితి జగన్ రెడ్డికి లేదు. సజ్జల రామకృష్ణా రెడ్డి గురివింజ గింజలా తమ కింద ఉన్న తప్పుల గురించి ఏమి మాట్లాడరు. లేని కేసులలో చంద్రబాబు నాయుడు ఉన్నారని మాట్లాడే తను, సిబిఐ కేసులలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు? 18 నెలలు జైల్లో ఉన్న విషయం ఎందుకు ప్రస్తావించరు? అంబటి రాంబాబు బ్లూ జీన్స్ వేసుకొని గంట రమ్మన్న వాయిస్, అవంతి శ్రీనివాస్ అరగంట చాలు అన్న వాయిస్, బట్టలు లేకుండా న్యూడ్ గా ఫోన్ కాల్స్ లో మహిళలను వేధిస్తున్న పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ గురించి ఉన్న కేసులను ఎందుకు పరిష్కరించ లేకపోతున్నారు? అంబటి రాంబాబు గంట రమ్మన్న వాయిస్, అవంతి శ్రీనివాస్ అరగంట చాలు అన్న వాయిస్ అప్పుడే ఫోరెన్సీక్ ల్యాబ్ కు పంపించి ఉంటే నిజం నిగ్గుతేలేది. మీ చిత్తశుద్ధి ఏంటో తెలిసేది. ప్రపంచం మొత్తం తల దించుకొనే విధంగా గోరంట్ల మాధవ్ కేసు ఉంటే దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఢిల్లీలో ప్రధాని చంద్రబాబును గౌరవించారు అని తెలియడంతో తాడేపల్లిలో పీఠాలు కదులుతున్నాయి. జగన్ రెడ్డి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోరు, తమ నాయకుల మీద వచ్చిన ఆరోపణలు వాస్తవాలు గురించి ఏమి మాట్లాడరు. ఆరోపణలు వచ్చిన నాయకుల వాయిస్, వీడియోలని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపిస్తే అరగంట, గంటలోనే నిజనిజాలు వెళ్లడయ్యే టెక్నాలజీ ఉన్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారు?

గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాడు పనిచేసి అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర పరువు తీస్తే …సిగ్గులేకుండా అది నాలుగు గోడల మద్య జరిగింది అంటున్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. మీరు గాని, మీ వైసీపీ ఏ నాయకుడైనా ఆ విడియోని మీ కుటుంబ సభ్యులకి చూపించగలరా. ఇప్పటికైనా చేసిన తప్పకు అతని మీద చర్యలు తీసుకోండి. చంద్రబాబు గారిని ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబు పేరు ఎత్తే అర్హత మీకు లేదు. గతంలో బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు విజన్ కి ఆశ్చర్య పోయి ఆంధ్రప్రదేశ్ లో అనేక కంపెనీలని తేవడం జరిగింది. విజన్ 2020 అనే డాక్యుమెంట్ నుంచి వచ్చే 20సంవత్సరాలలో మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ విజనరీ డాంక్యుమెంట్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుకుడు అని నేను చెబుతున్నది కాదు అమెరికా అధ్యక్షుడుగా బిల్ క్లింటన్ వచ్చాడు ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి అమెరికాలో వాళ్ల గవర్నర్ తో సమావేశం పెట్టి మాట్లాడాడు.

గతంలో ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓటులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ దమిలీనియంగా చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. టైం మ్యాగజైన్ ద్వారా “సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్”గా గుర్తింపు ఎకనమిక్స్ టైమ్స్ నుండి “బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్”గా గుర్తింపు 2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ తో కలసి “ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం” మే 2017లో “ట్రాన్స్ ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు” పొందారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చరిత్ర ఏంటి? వైసీపీ పని అయిపోయింది. గతంలో ప్రపంచం మొత్తం చూసే బిబిసిలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కొడుకుగా చేసిన కరెప్షన్ మీద గంటల తరపడి న్యూస్ వేశారు. లండన్ పార్లమెంటులో భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా లక్షల కోట్లు దోచేసినందుకు సిబిఐ, ఈడీ కేసులు భనాయించారని రోజుల తరపడి చర్చలు జరిగాయి ఇది జగన్ రెడ్డి చరిత్ర. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు మీద బురద జల్లితే బురద అంటే పరిస్థితే లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి తక్షణం మీడియా సమావేశం పెట్టి నేను చెప్పినవి ఏది తప్పో, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు అన్నారు కనీసం ఛార్జ్ షీట్ లో పేరు లేకపోవడం వాస్తవం అవునో కాదో మాట్లాడాలి. మీరు చెప్పిన అభియోగానికి కట్టుబడి ఉంటే ఛార్జ్ షీట్ లో చంద్రబాబు నాయుడు పేరు చూపించండి. ఇంకా అవాస్తవాలని, అబద్ధాలని చెబుతూ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయడం దుర్మర్గం. ఎ2 విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లాడంటే అక్కడున్నాడంటే సిబిఐ, ఈడి అధికారులని, ఇతర ఉన్నత అధికారులకి లంచ్ లు, సంచులు పెట్టి మానేజ్ చేయడం. వైసీపీ ఎంపీ లు అధికారులని మానేజ్ చేసి లంచ్ కావాలనే వాడికి లంచ్, సంచ్ కావాలనే వాడికి సంచ్, ఇంకా ఏదైనా కోరితే వాటిని ఏర్పాటు చేసి మీ సొంత పనులని చూసుకోవడం తప్పా ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఒక్క పనైనా చేయగలిగారా. క్రెడిబులిటి అంటే ముఖ్యమంత్రి సీటులో కూర్చొంటే రాదని జగన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు…దేవెగౌడ, ఐకే గుజ్రాల్ వంటి వారికి ప్రధానులుగా చేస్తే జగన్ రెడ్డి తన సొంత తల్లిని కనీసం ఎంపీ చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాం వంటి సైంటిస్టులను రాష్టపతిగా చేస్తే జగన్ రెడ్డి గోరంట్ల మాధవ్ లాంటి రేపిస్టులను, న్యూడిస్టులను ఎంపీలు, ఎమ్మెల్యేలను చేసి రాష్ట్రం ప్రతిష్ట మంటగలుపుతున్నారు. ఢిల్లీలో జరిగే ప్రతి అంశంకు సంబంధించిన చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.

LEAVE A RESPONSE