Suryaa.co.in

Andhra Pradesh

ఏళ్ళు గడుస్తున్నా అవుటర్ రింగు రోడ్డుకు మోక్షం లేదు

జిల్లాలో రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేస్తున్నారు. అగ్రిమెంట్ నాటికి పనులు పూర్తి చేయకుండా  ముఖం చాటేస్తుండడంతో చాలా చోట్ల పనులు పెండింగ్ పడుతున్నాయి. దీంతో గుత్తి  మండలంలోని  గుత్తి – గుంతకల్లు రోడ్డు – రజాపురం దగ్గర  నిర్మాణ పనులు ఆరేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై జనం తిరగలేక నరకయాతన పడుతున్నారు. ఇక గుత్తి అవుటర్ రింగ్ రోడ్డు  పనులు ప్రారంభమై ఐదు సంవత్సరాలవుతుంది.  గుంతకల్లు రోడ్డు నుండి న్యమతాబాద్, తురకపల్లి సమీపాన రోడ్డు వేసి నాలుగు సంవత్సరాలవుతుంది అక్కడ నుండి రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. అబ్బేదోడ్డి, మాముడూరు, ఎర్రగుడి, అణగనదొడ్డి, తురకపల్లి గ్రామాల ప్రజలు రోడ్డు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆరేండ్ల  కింద రూ.20 కోట్లతో శాంక్షన్ అయిన పనులను నేటికీ పూర్తిచేయని కాంట్రాక్టర్ పై చర్యలెందుకు  తీసుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేస్తున్నారు. అగ్రిమెంట్ నాటికి పనులు పూర్తి చేయకుండా  ముఖం చాటేస్తుండడంతో చాలా చోట్ల పనులు పెండింగ్ పడుతున్నాయి. రజాపురం గుత్తి బ్రిడ్జి పనులు  రోడ్డు నిర్మాణ పనులు ఆరేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై జనం తిరగలేక నరకయాతన పడుతున్నారు. ఎక్కడి బ్రిడ్జిలు అక్కడే..అదే విధంగా గుత్తి  మండలం లోని ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి, రాజపురం బ్రిడ్జి అలాగే పెద్ద వంక బ్రిడ్జి  నిర్మాణం గత ఆరుఏండ్లుగా   పెండింగ్ పడుతూ వస్తోంది. ఇప్పటికి రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టడం లేదు.మరో పక్క ప్రజా ప్రతినిధులు  కమీషన్లు ముట్టడం వల్లే  వీరు కాంట్రాక్టర్ పై పెదవి విప్పడం లేదని విమర్శిస్తున్నారు.

అయితే  టెండర్లు పొందిన కాంట్రాక్టర్లలో చాలా మంది అధికార పార్టీ కాంట్రాక్టర్లు కావడంతో ప్రజాప్రతినిధులు  సైతం వారి పై ఒత్తిడి తేవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్లే పనులు చేయడం లేదని మరికొందరు ప్రజాప్రతినిధులు వారిని వెనకేసుకువస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లో  కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు ప్రభుత్వం కట్టాల్సి  ఉందని అందుకే మళ్లీ కొత్త అప్పులు తెచ్చి పనులు చేయలేకపోతున్నారని పనులు పొందిన కాంట్రాక్టర్లు చెబుతున్నారు.  వెంటనే బిల్లులు చెల్లిస్తే ఏ పని ఆపమని,  బిల్లుల కోసం ఏళ్లతరబడి  వేచి చూడాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE