– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
సీపీఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి(72) అకాల మృతి కమ్యునిస్టు ఉద్యమాలకు తీరని లోటు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాల్లో సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వామపక్ష పార్టీల్లో కీలకనేతగా పేరుతెచ్చుకున్న సీతారాం ఏచూరి మరణం వామపక్షపార్టీల ఉద్యమాలకు తీరని లోటు. తుదిశ్వాస వరకు తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేసిన సీతారాం ఏచూరి మరణానికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.