Suryaa.co.in

Telangana

ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు

– మాజీ ఎంపీ. బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడం పట్ల మాజీ ఎం.పీ. బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని , సంతాపాన్ని తెలిపారు. నాలుగు దశాబ్దాల కాలం నుంచి సీతారాంతో వ్యక్తిగత పరిచయం ఉందని, గత ఏడాది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి పలుమార్లు సీతారాం తో భేటీ అయినట్లు వినోద్ కుమార్ తెలిపారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని వినోద్ కుమార్ అన్నారు.

LEAVE A RESPONSE