విజయవాడ : నగర ప్రజలకు నమ్మకమైన ఇంధన సేవలను అందించే దిశగా బుధవారం పటమట సెంటర్లో యలమంచిలి ఫిల్లింగ్ స్టేషన్ ఘనంగా ప్రారంభమైంది. సంస్థ అధినేత యలమంచిలి రాజీవ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తొలి విక్రయం జరిపి ప్రారంభోత్సవం చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యలమంచిలి ఫిల్లింగ్ స్టేషన్ నమ్మకానికి భరోసాగా నిలుస్తుందని, ఉత్తమ నాణ్యతతో కూడిన సేవలే తమ లక్ష్యం అని హామీ ఇచ్చారు. కొలత, నాణ్యత విషయంలో రాజీ పడకుండా వినియోగ దారులకు పెట్రోల్ , డీజిల్ విక్రయుస్తామన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో యలమంచిలి బసవేశ్వరరావు, కౌశిక్, తిలక్, సుంకర రవి, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజీవ్ యూత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.