– మంత్రి సురేఖ పై పరువునష్టం కేసు ఉపసంహరించుకున్న నాగార్జున
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వైరానికి తెరపడింది హీరోయిన్ సమంత కు సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు ..మంత్రి సురేఖ పై నాగార్జున వేసిన పరునష్టం దావాను ఆయన ఉపసంహరించుకోవడంతో, కేసుల కథకు తెరపడినట్లయింది. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేసిన పరువు నష్టం దావా కేసును, ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు.
అక్టోబరు 2, 2024న మీడియాతో మాట్లాడిన మంత్రి సురేఖ.. హీరోయిన్ సమంత- నాగచైతన్య విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున, మంత్రి సురేఖ పై పరువు నష్టం దావా కేసు ఫైల్ చేశారు. అయితే, కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు.