– ఏ అంశపైనైనా చర్చిద్దాం
• జగన్ కు, వైసీపీ నాయకులకు మంత్రి సవిత సవాల్
• అబద్ధపు ప్రచారాలు మానుకోండి
• మెడికల్ కాలేజీలపై నిజం చెబితే భయమెందుకు?
• చెరువులను మాయం చేసి లే అవుట్లు వేసిందెవరో అందరికీ తెలుసు
• రోజా, రజిని టీడీపీలోనే రాజకీయ ఏబీసీడీలు నేర్చుకున్నారు
• నా ఫొటో మార్ఫింగ్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు
• సత్ఫలితాలిచ్చిన బీసీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్
• టీచర్లగా 246 మంది బీసీ బిడ్డల ఎంపిక
– మంత్రి సవిత
అమరావతి : ‘మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం’ అని జగన్ సహా వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఎద్దేవా చేస్తూ సవాల్ విసిరారు.
తన ఫొటోను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ పొందిన 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఎంపిక కావడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్ ఓర్వలేక విషం కక్కుతున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ అబద్ధాలంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి – ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ నిర్వహణ… ఇలా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చుతున్నారన్నారు.
యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు, తిరుమలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ వికృతానందం పొందుతున్నాడన్నారు. ‘మీరంతా ఫుల్ నాలెడ్జ్ కలిగిన వాళ్లు కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడం ఎందుకు? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు సహా ఏ అంశంపైనైనా చర్చిద్దాం’ అని జగన్ సహా వైసీపీ నాయకులకు మంత్రి సవిత సవాల్ విసిరారు. కావాల్సినంత సమయం ఇస్తామని స్పష్టంచేశారు.
చెరువులు మాయం లే అవుట్లు వేశారు
తనపై వైసీపీ నాయకులు రోజా, ఉషశ్రీ చరణ్ చేసిన విమర్శలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. రోజా, విడదల రజనీ సహా ఎందరో వైసీపీ వలస నాయకులు టీడీపీలోనే రాజకీయ ఏబీసీడీ నేర్చుకున్నవాళ్లేనన్నారు. టీటీడీ లెటర్లు అమ్ముకున్నదెవరో నగిరి, కల్యాణదుర్గంలో ఎవరినడిగినా చెబుతారన్నారు. చెరువులను మాయం చేసి లే అవుట్లు వేసుకున్నదెవరో అందరికీ తెలుసన్నారు. మెడికల్ కాలేజీలపై నిజం చెబితే భయమెందుకు అని ప్రశ్నించారు. తోటి మహిళనని చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ‘అయిదేళ్లలో మీ నియోజక వర్గాల్లో చేసిన అభివృద్ధిపైనా, 15 నెలల కాలంలో పెనుకొండలో తాను చేసిన అభివృద్ధిపైనా చర్చకు సిద్ధం’ అని రోజాకు, ఉషశ్రీ చరణ్ కు మంత్రి సవాల్ చేశారు.
ఫొటో మార్ఫింగ్ పై ఫిర్యాదు
తన ఫొటోను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. మహిళలను కించపరచడం మానుకోవాలని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు హితవు పలికారు. సీఎం చంద్రబాబు నిర్మించిన సచివాలయంలోనే జగన్ పాలించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.