Suryaa.co.in

Telangana

‘మేఘా’తో మీది అవినీతి బంధం

– మేఘా సంస్థ చేసిన పనికి దేశమంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి
– మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు
– సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయింది
– మీరు వేసిన విచారణ కమిటీయే మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రిపోర్ట్ ఇచ్చింది..
– ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
– బావమరదికి అమృత్ టెండర్లు, మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారు.
– మేడిగడ్డ ఘటన లో మేఘా సంస్థను కంపెనీని బ్లాక్ చేయలేదు
– కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూ. 4350 కోట్లలో నీ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత?
– పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థ కు రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారు.
– కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 4350 కోట్ల టెండర్ ను మేఘా సంస్థకు అప్పగించావు
– మన వద్ద నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి ఈ కంపెనీ ద్వారా మూటలు
– బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు?
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: సాగు నీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారు. వాయు వేగంతో తెలంగాణ లో సాగునీళ్ల ప్రాజెక్ట్ లు కేసీఆర్ నిర్మించిన విషయం మీకు తెలుసు. కానీ అప్పట్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా , కమీషన్ల కోసమే అంటూ రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు..కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మేఘా కృష్ణారెడ్డిని పొలిటికల్ మాఫియా అంటూ కామెంట్ చేశారు. ఏ కంపెనీని ఆంధ్రా కంపెనీ అన్నారో…ఏ కంపెనీనిని ఈస్ట్ ఇండియా అన్నారో, ఏ కంపెనీ అరాచక కంపెనీ అన్నారో ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?

హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావటానికి మేము సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టాం. కానీ ఈ ప్రభుత్వం. మున్సిపల్ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోలేదు. సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ విషయాన్ని అసలు బయటకు తెలియకుండా, ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టింది. ఎందుకు దాచి పెట్టారో చెప్పాలంటూ నేను గతంలోనే డిమాండ్ చేశాను. ప్రమాదం పై జ్యూడిషీయల్ ఎంక్వయిరీ కోరాను, కంపెనీని బ్లాక్ చేయాలని అడిగాను.

మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు, ఈ ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారు. మొత్తం సంఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.అంతేకానీ కంపెనీని బ్లాక్ చేయలేదు. కాంగ్రెస్ నేత వివేక్ వెలుగు పేపర్ లోనే మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చర్యలు లేవని రాశారు..

నేటికి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ…సుంకిశాల అయోమయమంటూ కాంగ్రెస్ నేత పత్రికలోనే వార్త వచ్చింది. ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అని ముఖ్యమంత్రి అన్నారో , అదే కంపెనీ పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?.

మీరు వేసిన విచారణ కమిటీయే మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రిపోర్ట్ ఇచ్చింది..కానీ దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థ కు రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 4350 కోట్ల టెండర్ ను మేఘా సంస్థకు అప్పగించావు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పిన సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టావు.

సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థ పై చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమే. దానిని కూడా రద్దు చేయాలి. ఎల్ అండ్ టీ, ఎన్సీసీ ని కాదంటూ టెక్నికల్ బిడ్ లో డిస్ క్వాలిఫై చేశారు. కేవలం మేఘా, పొంగులేటి కి చెందిన రాఘవ సంస్థ కు మొత్తం పనులను రెండు కేకుల మాదిరిగా ముక్కలు ఇచ్చారు. మేఘా సంస్థతో కుమ్మక్కై డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నావు.

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూ. 4350 కోట్లలో నీ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత? మొన్న స్కిల్ యూనివర్సిటీ కోసం రూ. 200 కోట్ల విరాళాన్ని ప్రాజెక్ట్ లు కట్టబెట్టినందుకే ఇచ్చారా? కాళేశ్వరం నీళ్లను గండి పేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట. ఇది మరొక కుంభకోణం.

కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు మేము రూ. 11 వందల కోట్లతో ఖర్చుతో అన్ని సిద్ధం చేశాం.కానీ పెద్ద ఎత్తున కుంభకోణం చేసేందుకే దీన్ని రూ. 5, 500 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్ట్ ను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మేఘా సంస్థకే ఇవ్వటానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ విషయం నేను ప్రజలకు ముందే చెబుతున్నాను.

ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదు. వాళ్ల ఉద్యోగాలు ఊడటం ఖాయం. ఎక్కడ బిడ్ లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా మాకు తెలుసు. ఆరు గ్యారంటీలకు, హామీలు అమలు చేసేందుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు కూడా పైసలు లేవన్నారు.

కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారు. దాన్ని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అయిన మేఘా ఇవ్వటానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మన వద్ద నుంచి మహారాష్ట్ర కు మూటలు పోయాయి. ఢిల్లీకి కూడా ఈ కంపెనీ ద్వారా మూటలు పంపిస్తారు.

రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు అన్న సంస్థ పై చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం కుంభకోణాలను నేను ముందే ప్రజలకు వివరిస్తున్నా.ఎందుకు మీరు ఈ దోపిడీలు చేస్తున్నారో మాకు తెలుసు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేస్తే అధికారుల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగం పోయినట్లు పోతుంది.

కేబినెట్ లో కూర్చున్న మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి ఈ పనులు ఇస్తారా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందన్న విషయమన్న అసలు తెలుసా? రేవంత్ రెడ్డి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు?. మోడీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు ఉండవు.

బావమరదికి అమృత్ టెండర్లు, మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్ట్ లను రేవంత్ రెడ్డి పంచుతున్నాడు. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా? ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈడీ లు విజిలెన్స్ లు ఏం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మీదికి మాత్రమే ఈడీ, విజిలెన్స్ అంటూ వస్తారా? పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి వాళ్లు మాట్లాడారు. వీళ్లు మాట్లాడారు.

కోహినూర్ హోటల్ లో అదానీ కాళ్లు మొక్కి ఏం కాకుండా పొంగులేటి బతిమిలాడుకున్నాడు.. అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్రం సంస్థలు ఎందుకు విచారణ జరపటం లేదు. సీవీసీ ఏం చేస్తోంది?.

మేఘా సంస్థ చేసిన పనికి దేశమంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.పొంగులేటి అరెస్ట్ అవుతాడంటూ అందరి జాతకాలు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో. నీ కంపెనీకి కనీసం ఆఫీస్ ఆఫ్ బెన్ ఫిట్ అని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా పనులు కట్టబెడతారు?. రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.

అమృత్ టెండర్లను కూడా పొంగులేటి కంపెనీకి ఇచ్చారు. రాఘవ కంపెనీని కూడా గతంలో రేవంత్ రెడ్డి తిట్టాడు. ఇప్పుడు మాత్రం ఆ కంపెనీకి పనులు ఇస్తున్నాడు. మూసీ ని కూడా టెండర్లు కాకముందే మేఘాకు ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసేశారు. గోదావరి నీళ్లను హైదరాబాద్ కు తెచ్చేందుకు రూ. 11 వందల కోట్లతో అయిపోయే దానికి రూ. 5500 కోట్ల భారీ స్కాం చేయబోతున్నారు.

ప్రధాని మోడీ ఎన్నికలప్పుడు మాట్లాడటం కాదు. ఆర్ ఆర్ ట్యాక్స్ అంటివి కాదా? ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. ఇక్కడ నిరాటకంగా ఆర్ ఆర్ ట్యాక్స్ తో పాటు బిల్డర్ల నుంచి గజానికి వంద వసూలు చేస్తున్నారు. కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదు. ఇంత అరాచకంగా కుంభకోణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు?.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ సోదాలపై ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ మాట్లాడటం లేదు?.అదానీతో మీ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయో మాకు తెలుసు.. మీ కుంభకోణాలను బయటపెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. అయిన సరే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులపై ఇప్పటి వరకు స్పందించకపోవటం అంటే బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యిందన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. సుంకిశాల ప్రమాదానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్ ను బయట పెట్టటంతో ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ ను రేవంత్ రెడ్డి తారుమారు చేసిన చేస్తాడు.వెంటనే ఆ రిపోర్ట్ ను బయటపెట్టాలి. లేదంటే ఆ కమిటీ రిపోర్ట్ ను ఏదో చేస్తారు.

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు?. బీజేపోళ్లు నిద్రపోతున్నారా? నిజాయితీ ఉంటే ఎందుకు విచారణ జరపటం లేదు?. ఎన్నికల్లో ప్రయోజనం కోసం మేడిగడ్డలో ఓ పర్రెను పట్టుకొని లక్ష కోట్ల కుంభకోణం అన్నారు.

కేసీఆర్ ని బద్నాం చేసేందుకు మేడిగడ్డ పర్రె విషయంలో ఈ అరాచక శక్తులే ఏదో కుట్ర చేశారని నా అనుమానం. మేడిగడ్డ వద్ద ఇప్పటికీ రిపేర్లు చేయకుండా అది కొట్టుకుపోవాలనే చూస్తున్నారు. అమృత్ టెండర్ల ముఖ్యమంత్రి బావమరిదికి రూ. 11 వందల కోట్ల పనులను ఎలా ఇస్తారంటూ కేంద్రమంత్రి నేను ఉత్తరం రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదు.

గౌతమ్ అదానీ కొడుకుతో నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి ఇంట్లోనే చర్చలు జరిపారు. మోడీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణా రెడ్డికి అన్ని ప్రాజెక్ట్ లు ఇస్తున్నారు. రాయదుర్గంలో 84 ఎకరాలను కూడా ఆదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి చెబుతాడా ? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా…సర్కస్ నడుపుతున్నారా? ఈ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల బాగోతాలను బట్టలిప్పి ప్రజల ముందు నగ్నంగా నిలబెడతాం.

LEAVE A RESPONSE