– ఎన్నికల ముందు ఫ్రీ అన్నావు కదా?
– మరిప్పుడు మళ్లీ మరో 15 వేల కోట్లు వసూలెందుకు?
– మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ ఫ్రీ అన్న రేవంత్ ఇప్పుడు నాలుకమడతేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో ఇదే ఎల్‌ఆర్‌ఎస్ పేరిట 14వందల కోట్లు వసూలు చేసిన రేవంత్.. ఇప్పుడు మరో 15 వేల కోట్లు ముక్కుపిండి వసూలు చేసే దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తారు.
ఎక్స్ వేదికగా కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని, అడ్డదారిలో అధికారంలోకి రావడానికి అందులో చెప్పేవన్నీ మాయమాటలేనని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్రీ ఎల్.ఆర్.ఎస్. అని మభ్యపెట్టి, గద్దెనెక్కగానే నాలుగున్నర లక్షల మంది నుంచి ఏకంగా రూ. 1400 కోట్లను ముఖ్యమంత్రి ముక్కుపిండి వసూలు చేశారు. మరో 15,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసి ఖజానా నింపుకునేందుకు గడుపు పెంపు పేరిట మరో ఘరానా దోపిడీకి తెరలేపారు.
నాడు ఉచిత ఎల్.ఆర్.ఎస్. అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం రూపంలో వేల కోట్లు గడప గడపకు చేరితే, కాంగ్రెస్ హయాంలో రివర్స్ గేర్ లో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే